Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న దళితులు

దళితుల భూముల్లో హరిత హారం మొక్కలునాటే ప్రయత్నం

జిల్లా కలెక్టరు స్పందించి పట్టాలు ఇప్పించాలని డిమాండ్

మహాదేవపూర్ (భూపాలపల్లి) జూలై 26 (నిజం చెబుతాం).

దళితుల భూముల్లో హరిత హారం మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్న ఫారెస్ట్ అధికారులను దళితులు బుధవారం రోజున అడ్డుకున్నారు. జిల్లా కలెక్టరు స్పందించి పట్టాలు ఇప్పించాలని వారు కోరారు.

సూరారం గ్రామనికి చెందిన 120 మంది కుటుంబాలు పూర్వం50 సంవత్సరాలుగా భూమిపైన ఉన్నాము అని తెలిపారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మహాదేవపూర్ మండలం సూరారం గ్రామ శివారులోని సర్వే నెంబరు 279 లో రెవెన్యూ భూమి 60 ఎకరాలు,

అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అంతిమ పట్టా సర్టిఫికెట్లు ఒక్కొక్క మనిషి కి 20 గుంటల చొప్పున ఇచ్చింది అని వారు తెలిపారు.

ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు దాంట్లో మొక్కలు నాటడం ఎందో అర్దం కావడం లేదు అని తెలిపారు.

గతంలో సుమారుగా 10 మంది పై ఫారెస్ట్ అధికారులు అక్రమా కేసులు నమోదు చేసారని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిరుపేద లైన మాకు పట్టాలు ఇప్పించి తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేసారు.