Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కలెక్టర్ సార్ మా పాఠశాలను మీరే ఆదుకోవాలి

శిథిలావస్థలో తిరుమలాపురం పాఠశాల.

అరగోషాలు పడుతున్న విద్యార్థులు.

గతంలో కలెక్టర్ గౌతమ్ పాఠశాల మరమ్మత్తులు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు..

కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారులు.

కురవి,నిజంచెపుతాం,జూలై 26:

కురవి మండలం తిరుమలపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సరైన వసతులు లేకపోవడం చదువుకుంటున్న బిల్లింగ్ శిథిలావస్థలో ఉండి అరగోషాలు పడుతున్న స్కూల్ విద్యార్థులు సరైన వంటశాల పైకప్పు లేకపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సమస్యలే అంటున్న గ్రామస్తులు గతంలో కలెక్టర్ గౌతమ్ పాఠశాలను విసిటింగ్ చేయడం జరిగింది.

అటువంటి క్రమంలో తిరుమలపురం పాఠశాల యొక్క మరమ్మతులను కలెక్టర్ స్పందించి సంబంధించిన అధికారులను పాఠశాల మరమ్మతులను వెంటనే చేపట్టి విద్యార్థులు పడుతున్న మౌలిక వసతులను పరిష్కరించాలని ఆదేశించారు.

కలెక్టర్ గౌతమ్ ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారులు పాఠశాలను అధికారులు చూసి మరమ్మతులను వెంటనే చేస్తామని ఆరు నెలలు గడిచినప్పటికీ స్కూల్ యొక్క రూపురేఖలు ఎటువంటి చిన్న పనులు గాని మొదలు చేయకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా ఇదే పాఠశాల సుమారు 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు,ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు, ఉపాధ్యాయులు బోధించాలన్న విద్యార్థులు కూర్చోవాలన్నా గాని అనేకమైన వంటి సమస్యలతో పాటు ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాల వర్షంనికి కురుస్తున్నది,

కురుస్తున్న వర్షానికి గదులన్నీ నీరు చేయడంతో విద్యార్థులు కూర్చొని చదువుకోలేక అస్తవ్యస్తలు పడుతున్నారని గ్రామ వాపోతున్నారు.

వెంటనే కలెక్టర్ శశాంక్ స్పందించి మా ఊరి పాఠశాలను మరమ్మతులు పనులు చేయించవలసిందిగా గ్రామ ప్రజలు కోరారు.