భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
*వరద బాధితుల పట్ల అధికారులు.. అప్రమత్తంగా ఉండాలి
*ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు చేపట్టాలి.. జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక అలా
చర్ల జూలై 26 ( నిజం చెపుతాం) గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది గోదావరి ఉగ్రరూపం దాల్చింది
దీంతో భద్రాచలం నీటిమట్టం సాయంత్రానికి 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు
చర్ల మండలంలోని వర్ధమంపుకు గురి అయ్యే దండుపేట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక బుధవారం సందర్శించారు తాలిపేరు హై లెవెల్ వంతెన వద్ద ఆగి తాలిపేరు వరదలు పర్యవేక్షించారు
అనంతరం ముందగా వర్ధముంపుకు గురి అయ్యే దండుపేట గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ గ్రామస్తులను వరద సమస్యలపై గ్రామస్తులను అడిగి వివరాలను తెలుసుకున్నారు
వరదల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ సందర్భంగా గ్రామస్తులు గత సంవత్సరం వరదల్లో జరిగిన సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు
సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు వరద ఉధృత ఎక్కువగా ఉంటే ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు భద్రాచలం ఏఎస్పి పరితో జ్ పంకజ్ తాసిల్దార్ బి భరణి బాబు సిఐబి అశోక్ తాళి పేరు ప్రాజెక్టు డీ తిరుపతి. ఎస్సైలు వెంకటప్పయ్య.
టివి.సూరి. ఎంపీడీవో జి ప్రసాదరావు మండల పంచాయతీ అధికారి బద్ది రామకృష్ణ. మిషన్ భగీరథ ఎఇ.రాము. సివిల్ పోలీసులు సిఆర్పిఎఫ్ సిబ్బంది బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సోయం రాజారావు
ప్రచార కార్యదర్శి కె. శ్రీనివాస్ రెడ్డి రైట్ క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు కాకి అనిల్. ముసలి సతీష్. కార్ల రాంబాబు. గ్రామస్తులు పాల్గొన్నారు