Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పైసలిస్తేనే ఎంపీడీవో కార్యాలయంలో పనులు

ప్రతి సంతకానికి డబ్బులు అట… గ్రామ సర్పంచుల ఆవేదన

జరిగిన సంఘటనపై విచారణ జరిపి తక్షణమే సస్పెండ్ చేయాలని మండల సర్పంచ్ల డిమాండ్.

తుంగతుర్తి జులై 26 నిజం చెపుతాం న్యూస్

తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచు చేసిన పనులకు చెక్కులు జనరేటర్ కావాలంటే మామూలు… సమర్పించాల్సిందే

లేదంటే కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్… లేనిపోని కొర్రీలు పడుతున్నాడని మండల పరిధిలోని సూర్య తండా సర్పంచ్ లాకావత్ యాకూ నాయక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.

గ్రామానికి ప్రథమ పౌరుడు తో పాటు అధికార పార్టీకి చెందిన సర్పంచ్ కావడం, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న తమకు చేసిన పనులకు బిల్లులు చెక్కులు జనరేటర్ కావాలంటే పైసలు ఇవ్వనిదే పని జరగడం లేదని సర్పంచు ఆరోపిస్తున్నాడు.

జనన. మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నానంతరం అట్టి వివరాలు కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ లాగిన్ లోకి వస్తుందని తెలిపారు. సర్టిఫికెట్లకు సైతం 3000రూపాయలు సమర్పిస్తేనే పనులు జరుగుతున్నాయని సర్పంచు ఆరోపిస్తున్నారు.

అంతేగాక పి.ఎం. ఎఫ్ఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఇస్తున్న నిధులు సైతం సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ ల డిజిటల్ కీలను కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరే పెట్టుకుని సర్పంచులకు తెలియకుండా ట్రాక్టర్ ఈఎంఐ లు. కరెంట్ బిల్లులు. వర్కర్ల జీతాలు. సర్పంచుకు తెలియకుండానే నిధులను వాడుతున్నారు .

డిజిటల్ కిలు దగ్గర పెట్టుకొని నా దగ్గర లేవంటూ చెబుతున్నాడని ఆరోపించారు.. గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కావాలంటే కార్యాలయంలో డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని సర్పంచు ఆరోపిస్తున్నాదు.

పైగా వీటిపై నిలదీసి అడిగితే సంబంధిత అధికారి ఉప సర్పంచ్ కు లకు ఫోన్ చేసి మీ సర్పంచ్ గ్రామపంచాయతీ నిధుల నుండి ఎన్ని డబ్బులు డ్రా చేశాడో తెలుసా మీ గ్రామంలో అభివృద్ధి జరిగిందా అంటూ లేనిపోని చాడీలు చెబుతూ సర్పంచులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

గ్రామాభివృద్ధి కోసం సర్పంచులు ఉపసర్పంచులు ఏకమై గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంటే సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య లేనిపోని తగాదాలు పెడుతూ అధికారులు ఆనందాన్ని అనుభవిస్తున్నారని అన్నారు

. ప్రజలతో ఎన్నికై గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తమను కార్యాలయం సిబ్బంది ఇబ్బందులు పెడుతూ మాపై పెత్తనం తలాయించేది ఏంటని సర్పంచు ప్రశ్నిస్తున్నారు

ఇట్టి విషయాన్ని ఎంపీడీవో తో పాటు జిల్లా పంచాయతీ అధికారికి తెలిపిన ఫలితం లేదన్నారు.

ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నెలకు లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న, అవినీతికి అధికారులను సస్పెండ్ చేయాలని మండల సర్పంచులు కోరుతున్నారు..