ఖమ్మం – అశ్వారావుపేట నేషనల్ హైవే రోడ్డును పరిశీలించిన టీ.ఆర్.ఎస్ లోక్ సభపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు

పెనుబల్లి వద్ద NHAI అధికారులతో కలసి దెబ్బతిన్న రోడ్డును కొద్దీ దూరం వరుకు నడిచి వెళ్ళి పరిశీలించిన ఎంపీ నామ
అశ్వారావుపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఖమ్మం నుండి బయల్దేరి వెళ్లిన టీ.ఆర్.ఎస్ లోక్ సభపక్ష నేత,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మార్గం మధ్యలో పెనుబల్లి వద్ద ఆగి NHAI అధికారులతో కలిసి ఖమ్మం – అశ్వారావుపేట నేషనల్ హైవే రోడ్డు పై కొద్దీ దూరం వరుకు నడచి వెళ్ళి దెబ్బతిన్న రోడ్డు ను పరిశీలించారు. రోడ్డు పై ఏర్పడిన గుంతలను మరమ్మతులు చేయడంలో అధికారులు అలసత్వం చేయకుండా వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంపీ నామ సూచించారు. రోడ్డు మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చెప్పట్టాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులు అవసరాల కోసం ఎస్టిమేషన్ వేసి కేంద్రానికి పంపించామని అయితే అందుకు కావాల్సిన నిధులు ఇంకా రాలేదు అని NHAI అధికారులు ఎంపీ నామ గారి దృష్టికి తీసుకువచ్చారు ఈ విషయమై ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్రంతో వెంటనే తాను మాట్లాడి నిధులు విడుదల అయ్యేలా చూస్తానని నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్డుపై గుంతలు ఏర్పడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారని అలా జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీ నామ సూచించారు.