త్వరలో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం
ఉద్యాన అధికారిని అమరేశ్వరి.
ధర్మవరం జులై 26 (నిజం చెపుతాం) మండల పరిధిలోని చిగిచెర్ల రెవెన్యూ పంచాయతీలో గల గరుడ పల్లి లో అతి త్వరలో 11.10 ఎకరాలలో వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఉద్యాన అధికారిని అమరేశ్వరి తెలిపారు.
ఈ సందర్భంగా వారు బుధవారం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములో 11 వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ లను ప్రారంభించిందని, ఇందులో భాగంగా గరుడం పల్లి గ్రామంలో కూడా ఈ వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ను మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించడం జరిగిందన్నారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చొరువు వల్ల ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
75 కోట్ల వ్యయంతో ఈ పనులు మరో రెండు నెలల్లో ప్రారంభమవుతాయని, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద ప్రభుత్వం ద్వారా అనుమతి కావడం జరిగిందన్నారు