Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉరి తాళ్లతో గ్రామపంచాయతీ సిబ్బంది నిరసన

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో వేములపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బంది గత 20 రోజుల నుంచి సమ్మె చేస్తున్న సంగతి విధితమే.

అందులో భాగంగా మంగళవారం ఉరి తాళ్లతో సమ్మె నిర్వహించారు

అట్టి సమ్మెలో మండల జేఏసీ నాయకులు పాల్వాయి సైదులు మాట్లాడుతూ ఒక 20 రోజులు గా సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి ఏమాత్రం చీమకుట్టినట్టు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి ఏమాత్రం సిద్ధం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించి కార్మికులను రెగ్యులర్ చేయాలని ఆయన కోరారు.

ముఖ్యంగా మల్టీ పర్పస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సమ్మె చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది పుట్టల శీను, కొండేటి సోమయ్య, శాంతి కుమార్, ఎలమంద చారి, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.