Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తాలి పేరు ప్రాజెక్టుకు… భారీగా వరద…23 గేట్లు ఎత్తివేత… 1,84,023 క్యూసెక్కుల నీరు విడుదల

తాలి పేరు ప్రాజెక్టుకు… భారీగా వరద నీరు

*23 గేట్లు ఎత్తివేత 1.84.023 క్యూ చెక్కుల నీరు విడుదల

చర్ల జులై 26 (నిజంచెపుతాం) మండలంలోని పెద్దమిడిసిలేరు మధ్యతరహా ప్రాజెక్టుకు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు మండలంలో ఎక్కడ చూసినా భారీ వరద నీరు చేరుకొని రోడ్లు ముంపుకు గురి అయ్యాయి

పల్లప్రాంతంలో వర్షపు నీరు డ్రైనేజీల గుండా ఇళ్లల్లోకి నీరు చేరుకుంది. వాహనలు కార్లు ఆటోలు మోటార్ సైకిళ్ళు వరద నీరుకు రోడ్లపై పోలేని పరిస్థితి ఏర్పడింది

చతీష్ గడ్ నుండి చింత వాగు చీకటి వాగు రోటింత వాగు వచ్చే వరదలకు ప్రాజెక్టు కు భారీగా నీరు చేరుకుంది

దీంతో ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 25 గేట్లగాను 23 గేట్లు పూర్తి గా ఎత్తివేసి 1.84.023క్యూ చెక్కుల నీరును దిగువనున్న గోదావరి లోకి వదిలినట్లు ప్రాజెక్ట్ అధికారులు డి ఈ తిరుపతి ఉపేందర్ వెల్లడించారు

పేరూరు నుండి వచ్చే గోదావరి వరద కు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఉదయం 11 గంటలకు 41. 20 అడుగులకు చేరుకుంది