Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నాలుగో యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం

శ్రీశైలం ప్రాజెక్టు అమ్రాబాద్ మండలం (నిజం న్యూస్) శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో చేపట్టిన నాలుగో యూనిట్ ట్రయల్ రన్ విజయవంతమైంది.

2020 వ సంవత్సరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో జల విద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో నాలుగు పాడయ్యాయి. ఇంతవరకు మూడు యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

పూర్తిగా ధ్వంసమైన నాలుగో యూనిట్ కుమరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. ట్రాన్స్కో హైడల్ డైరెక్టర్ వెంకట్ రాజం, సీఈ సూర్యనారాయణ ఆధ్వర్యంలో యూనిట్ ను మెకానికల్ స్పిన్నింగ్ పద్ధతిలో ట్రయల్ రన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో రిమోట్ ఆపరేషన్ ద్వారా యూనిట్ ను రన్ చేసే పనులను చేపట్టినట్లు సీఈ పేర్కొన్నారు దీన్ని 45 రోజుల్లో గ్రిడ్ కు అనుసంధా నిస్తామన్నారు.