ఒకే స్టోరీతో 3 సినిమాలు …. మూడు హిట్టే
కథ ఒకటే హీరేలే ముగ్గురు వేర్వేరు. మూడు సినిమాల కథ ఒకటే కాని కథనంలో మార్పులు ఉన్నాయి.
కథ విషయానికి వస్తే పుట్టుకతోనే కోటీశ్వరుడు అయిన కథానాయకుడు తన తల్లిదండ్రులను వదలిపెట్టి దూరంగా ఒక పల్లెటూరులో మామూలు వ్యక్తిగా జీవిస్తుంటాడు. ఆ ఊరి ప్రజలను పట్టి పీడిస్తున్న విలన్ ను ఎదుర్కొని ఊరి ప్రజలను కాపాడుతాడు.
ఈ మూడు సినిమాలు దాదాపు ఒకే కథతో రూపొందుకున్నవే. మూడు సినిమాలు హిట్టే. అవేంటో మీరే చదవండి.
మొదటి సినిమా …రామరాజ్యంలో భీమరాజు
మొట్టమొదటి సారిగా ఈ కథతో 1983వ సంవత్సరంలో జులై 28 వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ హీరో, శ్రీదేవి హీరోయిన్ గా రామరాజ్యంలో భీమరాజు సినిమా విడుదల అయింది.
ఎ. కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోటీశ్వరుడైన కథానాయకుడు తన తండ్రితో ఛాలెంజ్ చేసి ఒక పల్లె టూరుకు వెళ్తాడు. అక్కడ రామరాజు అనే ప్రతి నాయకుడు చేస్తున్న అక్రమాలకు ఎదురు నిలుస్తాడు.
అక్కడే హీరోయిన్ ఇంట్లో ఉంటూ ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడు. భీమరాజు పేరుతు రామరాజు చేస్తున్న అక్రమాలకు ఎదురు నిలిచి అతని ఆట కట్టిస్థాడు.
క్లైమాక్స్ లో హీరో తండ్రి ఆ ఊరికి రావడంతో హీరో కోటీశ్వరుడని ఆ ఊరి ప్రజలకు తెలుస్తుంది.
రెండో సినిమా….జననీ జన్మభూమి
ఆ తర్వాత సంవత్సరానికి అంటే 1984 లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన జననీ జన్మభూమి సినిమా ఇదే కథతో విడుదల అయింది. శంకరాభరణం రాజ్యలక్ష్మి హీరోయిన్ నటించారు.
కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.
పుట్టుకతోనే కోటీశ్వరుడైన హీరో కొన్ని పరిస్థితుల కారణంగా తన సొంత ఇంటిని తల్లిదండ్రులను వదలిపెట్టి ఒక మారుమూల పల్లె టూరుకు వెళతాడు.
ఆ ఊరిలో చేనేత కార్మికుల కష్టాలను దోచుకుంటున్న దళారీలకు ఎదురు నిలుస్తాడు. ఒక సమయంలో హీరో ప్రాణాలను కోల్పోయే స్థితి కూడా వస్తుంది.
చివరకు ఆ ఊరి ప్రజలు హీరో కోటీశ్వరుడని తెలుసుకుంటారు.
మూడో సినిమా…శ్రీమంతుడు
2015 ఆగస్ట్ 7వ తేదీ ఇదే కథతో శ్రీమంతుడు. ఇందులో హీరో మహేష్ బాబు. దర్శకత్వం కొరటాల శివ.
ఇందులో పుట్టుకతోనే కోటీశ్వరుడైన హీరో హీరోయిన్ తో పరిచయం కారణంగా తన సొంత ఊరు గురించి తెలుసుకుని ఆ ఊరుకు పోతాడు.
ఈ ఊరి ప్రజలను పట్టి పీడుస్తున్న మినిస్టర్, అతని తమ్ముళ్లతో పోరాడతాడు.
ఈ పోరాటంతో హీరో ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటాడు.
ఈ సమయంలో హీరో తండ్రి తన స్వగ్రామానికి రావడంతో ఆ ఊరి ప్రజలు హీరో కోటీశ్వరుడని తెలుసుకుంటారు.
ఇది కూడా చదవండి…ప్రపంచాన్ని వెలివేసిన మనుషుల గురించి మీకు తెలుసా..