Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రపంచాన్ని వెలివేసిన మనుషుల గురించి మీకు తెలుసా??

ఈ భూమి మీద మనకు తెలియని వింతలు నిజాలు చాలానే ఉన్నాయి..

అంతెందుకు మన భారత దేశంలోనే తెలియని నిజాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో చాలా నిజాలు ఎవరికీ తెలియవు..

అయితే మనం చాలా విషయాలు చూశాం మన సమాజంలో ఎవరైనా తప్పు చేస్తే వెలివేయడం లేదా శిక్షించడం వంటివి చేస్తాం…

ప్రపంచాన్ని వెలివేసిన మనుషులు ఎవరో తెలుసా??

ప్రపంచాన్ని అసలు మనుషులు వెలివేయడం ఏంటి అనుకుంటున్నారా కానీ అదే నిజం…

ఆ మనుషులు  ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నారు.

అయితే వారు 60 వేల సంవత్సరాలుగా ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు.

ఇక్కడ విశేషం ఏంటంటే వారు నివసించేది ఎక్కడో కాదు మన భారతదేశంలోనే….

ఆ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకుందాం….

బంగాళాఖాతంలోని నార్త్ సెంటినెల్ ఐలాండ్ లో ఉంది.

అయితే ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లోని కొంత భాగంలో ఉంది.

భారత దేశ కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులు ఎంతో సుందరమైనవి దీనిని చూసేందుకు ప్రతి సంవత్సరం చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు.

ఈ ద్వీపం 60 వేల సంవత్సరాల క్రితం ఏర్పడింది అని చెప్తుంటారు..

అయితే ద్వీపాలలో ఒక భయంకరమైన తెగ నివసిస్తుంది. అయితే ఆ తెగను సెంటినెల్ తెగగా పిలుస్తూ ఉంటారు. ఈ తెగ ప్రజలు మనుషుల్ని హత్య చేసిన కేసు ఉండదు శిక్ష ఉండదు…

ఆ తెగ గురించి తెలుసుకుందాం…

ఈ సెంటినెల్ ప్రజలు అండమాన్ నికోబార్ ఐలాండ్స్  జీవిస్తూ ఉంటారు

ఈ తెగ ప్రజలను చూడడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. 1967లో ఒక శాస్త్రవేత్త ఈ తెగ ప్రజలతో సంబంధం కలుపుకోవడానికి ప్రయత్నం చేశాడు

ముందుగా ఈ తెగకు కొన్ని బహుమతులు ఇచ్చిన తీసుకోకపోగా తెగ ప్రజలు ప్రభుత్వ ప్రతినిధులపై దాడి చేశారు.

వారికి ఇష్టం లేదంటూ మలవిసర్జన భంగిమలు నిరసన వ్యక్తం చేశారు.. అలా భంగిమ గుర్తు ఏంటంటే వారిని అవమానించినట్టుగా ఆ తెగ ప్రజలు గుర్తు.

అలా మీరెవరో మా దగ్గరికి రావద్దని సూచనలు చేశారు.

సెంటినెల్  ప్రజలు ఎవర్ని కలుసుకోరు ఎవరిని వారిలోకి ఆహ్వానించరు.. అయితే 2004లో సునామీ వచ్చి భారతదేశంలో చాలా ప్రదేశాలు నాశనం అయ్యాయి

ఈ ద్వీపంలో ఉన్న ప్రజలకు కూడా చాలా కష్టాలు వచ్చాయి కి తెగ ప్రజలకు ఆహారం నీరు విమానం ద్వారా మన భారత ప్రభుత్వం అందించిన వారు తీసుకోకపోగా తిరిగి సహాయం చేయడానికి వచ్చిన విమానాలపై బాణాలతో దాడులు చేశారు.

2006లో ఇద్దరు చేపలు వేటగాళ్లు వేటలో భాగంగా ఈ ద్వీపం వైపు వెళ్తే వారిని చూసిన ఆ తెగ ప్రజలు చాలా దారుణంగా చంపేశారు.

ఇక్కడి ప్రజలకు జాన్ అనే వ్యక్తి మత బోధన చేయడానికి వెళ్ళాడు అయితే అతన్ని ఈ తెగ ప్రజలు చంపేశారు. కొంతమంది ఏమంటున్నారంటే వారిని వారిలాగే ఉన్ననివ్వాలంటున్నారు

భారత ప్రభుత్వం కూడా ఇటీవల అక్కడికి వెళ్లి వారికి కొన్ని సూచనలు చేసింది ఈ తెగ ప్రజలను చూడడానికి ఎవరూ లోపలికి వెళ్ళకూడదని ఎవరైనా మూడు కిలోమీటర్ల దూరం నుండే చూడాలని సూచించారు.

ఒకవేళ ఇక్కడ ప్రజలను కలవాలని చూసినా మాట్లాడాలని ప్రయత్నించిన వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భారతదేశ రక్షణలో ఉన్న ఈ ద్వీపం భూమిపై ఆధునిక నాగరికతకు ఏమాత్రం తాకనీ ప్రదేశంగా మిగిలిపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు.

ఇక్కడ ప్రజలకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో అసలు తెలియదు. ఈ తెగ ప్రజలకు డబ్బు వివిధ రకాలైన ఆహార పదార్థాలు మందులు ఎలా ఉంటాయో కూడా తెలియదు.

మీకు ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు వీడికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎలా అని???

అయితే మీరు పూర్తిగా అడవిలో ఉన్న కొన్ని ఆయుర్వేద మొక్కల మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు.