Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అధిక వర్షాలతో పత్తి పంటపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పెన్ పహాడ్ ప్రతినిధి జులై 25 నిజం చెప్తాం
మండలం పరిధి లో మాచారం గ్రామంలో మంగళవారం శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి ఇన్చార్జ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ బి లవకుమార్ మరియు శాస్త్రవేత్తలు డి నరేష్ డి ఆదర్శ్ బృందం పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.

ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల వలన ప్రత్తి పంటలలో నీరు నిలువ ఉండకుండా చుసుకోవా లని తెలియచేశారు. నీరు నిలువ ఉన్నచో మొక్కలు కుళ్ళిపోయి చనిపోవడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి అలాంటి లక్షణాలు గమనించినప్పుడు నివారణకు ట్రైకోడెర్మా 5 మి.లీ. లీటరు నీటికి కలిపి మొక్క వేర్ల దగ్గర పోయాలని తెలిపారు.

ప్రత్తి పంట త్వరగా కోలుకోవటానికి నీటిలో కరిగే ఎరువులు అయిన (19:19:19) లేదా మల్టీ-కే (13:00:45) లేదా యూరియా 10 గ్రా. లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పంటలపై పిచికారి చేసుకోవాలని తెలిపారు.

రసం పీల్చే పురుగులు అయిన పేనుబంక, పచ్చ దోమ వంటివి గమనించినట్లయితే వాటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి. లీ. లీటరు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా అసిఫేటే 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని మరియు శనగ పచ్చ పురుగు గమనించినట్లైతే నోవల్యూరాన్ 1 మి లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని కే.వి.కే సస్యరక్షణ శాస్త్రవేత్త డి ఆదర్శ్ సూచించారు.

విత్తిన 25 నుంచి 30 రోజులలో వచ్చే గడ్డి జాతి మరియు వెడల్పకు కలుపు మొక్కలను నివారించడానికి పైరిథాయోబాక్ సోడియం 1.25 మి.లీ. (+) క్విజలోపాప్ ఇథైల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా నివారించుకోవచ్చని కే.వి.కే సేద్య విభాగం శాస్త్రవేత్త డి నరేష్ తెలిపారు.

ఏవో కృష్ణ సందీప్, రాములు, కేశవులు రావే విద్యార్థులు గోవర్ధన్, అజయ్, రాజు, సుజాన్ పాల్గొన్నారు.