జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడిన గిరిజన ఉద్యమ నాయకుడు కొమరం భీమ్

మా ఊర్లో…. మా రాజ్యం.. అనే నినాదంతో గెరిల్లా పోరాటం చేసి తరతరాల ఆదివాసి బిడ్డలకు స్ఫూర్తి దాత అయ్యారు కొమరం భీమ్. ఈయన తెలంగాణ రాష్ట్రంలోని పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో సంకేపల్లి గ్రామంలో కొమరం చిన్ను, సోంబాబు దంపతులకు 1901 సంవత్సరంలో జన్మించారు .కొమురం భీం 15 ఏళ్ళ వయసులో ఉండగా ఆయన తండ్రి చిన్ను అటవీ శాఖ జరిపిన దాడిలో మృతి చెందాడు. దీనితో తీవ్రంగా కలత చెందిన కొమురం భీం నా జాతి కి విముక్తి కల్పించాలని దృఢసంకల్పంతో పరాయి పాలన పై యుద్ధం ప్రకటించారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా శైలిలో యుద్ధం చేశారు. అడవిని నమ్ముకుని జీవనోపాధి కొనసాగిస్తున్న ఆదివాసి బిడ్డలకు సర్వహక్కులు దక్కాలని ఆయన పోరాటం జరిపారు . అక్టోబర్ 27, 1940లో వీర మరణం పొందారు. ఆయన పోరాట ఫలితమే నేడు యావత్ దేశం లోని ఆదివాసి బిడ్డలకు స్వతంత్ర ఫలాలు దక్కాయి. ఆయన స్ఫూర్తితో నేటి గిరిజన యువత అనేక పోరాటాలు నిర్వహించి, నిర్వహిస్తూ విజయం సాధిస్తున్నారు. దీనితో ఆదివాసి బిడ్డలకు కొమరం భీమ్ స్ఫూర్తి అయ్యారు.