Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒంటి కాలు పై నిలబడి నిరసన వ్యక్తం చేసిన గ్రామపంచాయతీ కార్మికులు

వర్షంలోనూ కొనసాగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె..

కేసముద్రం మండల రిపోర్టర్, జూలై 25(నిజం న్యూస్ ):

మంగళవారం రోజున సిఐటియు ఆధ్వర్యంలో ఇనుగుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గ్రామపంచాయతీ కార్మికులు ఒంటి కాలు పై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికుల మండల అధ్యక్ష కార్యదర్శులు బోళ్ల, రాములు బూర ,యాక లక్ష్మి మాట్లాడుతూ గత 20 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే బిఆర్ఎస్ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ గ్రామపంచాయతీ కార్మికుల ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ వివిధ సభలలో పల్లెలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం బాగుంటుందని పల్లెల అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్నామని చెప్పుకోస్తున్న ముఖ్యమంత్రి పల్లెలను గ్రామాలను పట్టణాలను పరిశుభ్రంగా చేసే కార్మికుల సమస్యలను పరిష్కరించ క పోవడం ఏంటని అడుగుతున్నారు.

నెలకు ఇచ్చే రూ.8500,పెరిగిన ధరలతో పోలిస్తే కుటుంబ పోషణ భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా వర్షాల్లో కూడా సమ్మె చేస్తుంటే ఎమ్మెల్యేలు ,మంత్రులు, ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు .

ఇప్పటికైనా బిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ,కనీస వేతనం నెలకు రూ. 26000, వేల రూపాలు ఇవ్వాలని ,గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, పది లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ,పెండింగ్ వేతనాలు చెల్లించాలని ,నెల నెల జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.

ఈ కార్యక్రమంలో ఇద్దమ్మా, బిక్షం ,యాకమ్మ ,పి సుగుణ ,అనిత ,పార్వతమ్మ ,ఎల్లమ్మ ,వెంకటమ్మ ,సోమక్క ,ఉమా తదితరులు పాల్గొన్నారు.