Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అయ్యో అనేటోళ్లే లేరాయే..?

వర్షానికి సైతం లెక్కచేయని జిపి కార్మికులు..

కరోనా సమయంలో కష్టజీవులు..

20వ రోజు కొనసాగుతున్న సమ్మె

కేసముద్రం మండల రిపోర్టర్,జూలై 25 (నిజం న్యూస్): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 20 రోజులకు చేరుకున్నాయి.

ఈ మేరకు జిపి కార్మికులసంఘంమండల అధ్యక్షుడు జాటోత్ మంగీలాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో వివిధ రకాల పనులు చేస్తూ గ్రామాభివృద్ధికి గ్రామ నిర్వహణకు కృషి చేస్తున్న జిపి కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి జిపి కార్మికులకు జీవో నెంబర్.60 అమలు చేసి, జిపి సిబ్బందిని పర్మినెంట్ చేయాలని పేర్కొన్నారు.

మా యొక్క న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణరాష్ట్రపంచాయతీ
రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేపర్ ప్రకటన కాకుండా మా యొక్క రాష్ట్ర నాయకులతో చర్చలు జరపాలని, రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేంతవరకు సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గంధసిరి వెంకటేశ్వర్లు, వల్లందాస్ అనిల్ ప్రమోద్,సుధాకర్, నాగయ్య, అశోక్, లింగమ్మ నర్సింగ్ బాన్ ఠాకూర్,శేఖర్, భూక్యా లాల్ సింగ్,ధారావత్ శీను, జాన్సన్, కొమురయ్య ఆయా గ్రామాల జిపి కార్మికులు పాల్గొన్నారు.