Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గిరిజన గురుకులం ప్రిన్సిపాల్ పనితీరుపై అదనపు కలెక్టర్… ఆగ్రహం

వారం రోజుల్లో పాఠశాల సమస్యలన్నీ పూర్తి చేయాలి.

ప్రిన్సిపాల్ ను మార్చాలని కోరిన, బిజెపి పార్టీ నాయకులు

అదనపు కలెక్టర్ ఏ.వెంకటరెడ్డి

తుంగతుర్తి జులై 25 నిజం చెపుతాం న్యూస్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలోని విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు.

ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలను అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి సందర్శించారు. ఈ మేరకు పాఠశాలలోనీ వంటగదులను, తరగతి అదనపు గదులను, పరిసరాలను, వాటర్ సప్లై ప్రదేశాలను పరిశీలించారు.

పాఠశాలలో సమస్యలు చాలా ఉన్నాయని వారం రోజులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోతే ప్రిన్సిపాల్ దుర్గ భవానిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్థులు జేసీని కలిసి తమకు నెలకొన్న సమస్యలను వివరించారు. వాటర్ కలుషితం కావడంతో విద్యార్థినిలు అస్వస్థతకు గురైనట్లు నీటి శాంపిల్ ను ల్యాబ్ కు పంపించనున్నట్లు తెలిపారు.

ఆయనతోపాటు తుంగతుర్తి తహసిల్దార్ రాంప్రసాద్,ఎంపీడీవో బీమ్ సింగ్, ఎంఈఓ బోయిన లింగయ్య, ఆర్ సి ఓ లక్ష్మయ్య పాల్గొన్నారు.