Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వయ్యారాలను వలకబోస్తున్న..దుంకుడు జలపాతం

జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలోని నవాబుపేట రెవెన్యూ శివారులో దుంకుడు జలపాతం వరద నీటితో దునుకుతున్నది.

శాంతినగర్ గ్రామ సమీపంలో ఉన్న వెలిశాల గుట్టల నడుమ నుంచి అలలారుతున్న అందాలతో దునుకుడు చేస్తున్నది.

పచ్చని అడవి మధ్య గుట్టలపై నుంచి వాలుజారుతూ వయ్యారాలు ఒలకబోస్తూ కిందకు జాలువారుతున్నది.

చిట్యాల మండల కేంద్రానికి ఎనమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతం పాదచారులను, వాహనదారులను ఆకట్టుకునేలా జలకలను సంతరించుకుంటున్నది.

కాగా టేకుమట్ల, చిట్యాల మండల కేంద్రాల మధ్యలో ఉన్న జలపాతాన్ని చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో తరలివచ్చి దునుకుతున్న జలపాతాన్ని చూసి పోతున్నారు.

గల గల సవ్వడి చేస్తూ, ముచ్చటగొల్పుతున్న జలపాతం తన అందాలతో చూపరులను కట్టిపడేస్తుంది.