Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ లో (స్థానిక) లోకల్, నాన్ లోకల్ లొల్లి

మహబూబాబాద్ నియోజకవర్గ స్థానిక నాయకులకే టికెట్ ఇవ్వాలని కార్యకర్తల డిమాండ్

ఆశ వాహులలో రాష్ట్ర స్థాయి నాయకులు

తెలంగాణ స్టేట్ బ్యూరో జూలై 25 నిజం న్యూస్

మహబూబాబాద్ జిల్లా లో జిల్లా కేంద్రంగా ఉన్న మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లో లోకల్ నాన్ లోకల్ వార్ నడుస్తుంది

ఇప్పటి వరకు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ స్థానికి నాయకులు గా ఉన్నారు కాబట్టి విజయం సాధించారని కార్యకర్తల ఆలోచన .

గతంలో ఎమ్మెల్యే గా ఉన్న మాలోత్ కవిత కూడా ఇదే జిల్లాకు చెందిన డీఎస్ రెడ్యానాయక్ అప్పటి మంత్రి కుమార్తె కావడం విశేషం

ఇప్పుడు కూడా స్థానిక నాయకులకు టికెట్ వస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు

కానీ సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే వర్గ పోరు ఇక్కడ కూడా ఉన్నది మహబూబాబాద్ నుండి రాష్ట్ర స్థాయీ నాయకులు టికెట్ ని ఆశిస్తున్నారు కానీ వారు ఎవరు స్థానికులు కారు ,

టికెట్ కోసం స్థానిక నాయకులు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు వారిలో స్థానిక డాక్టర్ మురళి నాయక్ ముందు వరుసలో ఉన్నారు

వీరి తండ్రి గతంలో మానుకోట జడ్పిటిసి గా, భార్య మానుకోట మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు వీరిది రాజకీయకుటుంభం కాబట్టి ఎమ్మెల్యే కూడా విజయం సాధిస్తారని కార్యకర్తల మనోభావం కానీ వీరిని ఇంకో వర్గం నేతలు వ్యతిరేకిస్తున్నారు

గతంలో కేంద్ర మంత్రి గా పని చేసిన ములుగు జిల్లా కు చెందిన పోరికా బలరాం నాయక్ కూడా టికెట్ ఆశిస్తున్నారూ కానీ వీరు గత అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు

అప్పుడు స్థానికులు కాదు అనే చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతు ఇవ్వలేదు దాని తరవాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎంపీ గా కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయారు

కాబట్టి వీరికి టికెట్ ఇస్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తది అని చర్చించుకుంటున్నారు అదే విధముగా బెల్లయనాయక్ కూడా టిక్కెట్ ని ఆశిస్తున్నా వారిలో ఉన్నారు

వీరు లంబాడా సామజిక వర్గానికి చాలా సేవలు చేసి ఉన్నారు కానీ వీరు కూడా స్థానికులు కాకపోవడం గమనార్హం వీరితో పాటూ రాధ, రమేష్ నాయక్ లు కూడా టికెట్ ఆశిస్తున్నారు

ఇప్పుడు ఎక్కడ చూసినా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ లోకల్ నాన్ లోకల్ గురించే చర్చించుకుంటున్నారు

అధికంగా స్థానిక నాయకులకు ఇస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ జెండా మానుకోట నియోజకవర్గంలో కచ్చితంగా ఎగరవేస్తామని నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు

మరి కాంగ్రెస్ హైకమాండ్ కార్యకర్తల డిమాండ్ ని అంగీకరిస్తారా లేదా నాయకుల పలుకుబడికి లొంగుతారో వేచి చూడాలి.