Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

30 రోజుల్లోనే బీటీ రోడ్డుకు బీటలు

నాసిరకంగా రోడ్డు నిర్మాణం పనులు..
*కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. గ్రామ ప్రజలకు శాపం
*పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు.
చర్ల జూలై 25 (నిజం చెపుతాం) మండలంలోని సుందరయ్య కాలనీ నుండి వీరాపురం వరకు2.60కి మీటర్లు రామంజపురం నుండి లంక వరకు 2.60కి మీటర్లు ప్రధానమంత్రి యువజన పథకం కింద 2.49 కోట్ల నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణం పనులు నాసిరకంగా జరిగాయి

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా చేపట్టిన రోడ్డు పనులు గ్రామస్తులకు శాపంగా మారాయి 30 రోజులు తిరగకముందే బిటి రోడ్డు బీటలు బారిందని గ్రామస్తులు పాలెం నాగరాజు కల్లూరి కృష్ణ బొగ్గుల శంకర్ రావు లు ఆరోపిస్తున్నారు

ఎన్నో ఏళ్ల నుండి మట్టి రోడ్డు బుడదలో నడుస్తూ నానా ఇబ్బందులు పడ్డామని ప్రభుత్వం కరుణించి ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద రోడ్డును మంజూరు చేస్తే కాంట్రాక్టర్ గ్రామస్తుల మాటను లెక్కచేయకుండా ఇష్టానుసారంగా రోడ్డు పనులు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు

 

ఆర్ అండ్ బి అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే పనులు నాసిరకంగా సాగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు రోడ్డు పనులను పరిశీలించి బీటలు బారిన రోడ్డు నిర్మాణం పనులు మళ్లీ పునర్నిర్మాణ చేపట్టాలని రామాంజపురం సుందరయ్య కాలనీ వీరాపురం గ్రా

మ ప్రజలు కోరుతున్నారు