రైతులను అమితంగా ఆకర్షిస్తున్న మెట్ట వరి సేద్యం
మెట్ట వరి సాగు పై దృష్టి సారిస్తున్న ఉమ్మడి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో రైతులు
మెట్ట సాగులో చెంబుని గూడెం రైతులు
మెట్ట వరి సాగు పై ప్రత్యేక కథనం
జూలూరుపాడు, జూలై 24(నిజం చెపుతాం న్యూస్)
జిల్లాలోతొలిసారిగా నూతన పద్ధతిలో వరిసాగుకు ఆ గ్రామం వేదికయింది. ప్రయోగాత్మకంగా గత ఏడాది పలువురు రైతులు చేపట్టినమెట్టవరిసాగు విధానం విజయవంతమయ్యింది
విత్తనాలను ఒక్కరోజు నీటిలో నానబెట్టి ముక్కు పగిలిన తర్వాత దమ్ములో నేరుగా వెదజల్లే పద్ధతి లేదా (డ్రమ్ సీడర్) తో విత్తనాలను వేసే పద్ధతి ప్రయోగాత్మకంగా కాకర్ల గ్రామానికి చెందిన రైతు తానం హరికృష్ణ తనకున్న నాలుగు ఎకరాలలో (డ్రమ్స్ సీడర్) దమ్ము చేసి దుక్కిలో నేరుగా ఎదగల్లడం జరిగింది.
దీనిద్వారా ఆ రైతుకు పెట్టుబడి తగ్గి దిగుబడి పెరగడంతో అతని చూసిన రైతులు ఈ సంవత్సరం అదే పద్ధతిని అనుసరించేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు
నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించే ఈ విధానం రైతులను అమితంగా ఆకర్షించింది
దీంతో మండలంలోని కొత్తూరు, అన్నారప్పాడు, గుండరేవు, వినోబానగర్, జూలూరుపాడు, వెంకన్నపాలెం, కాకర్ల, రైతులు పెద్ద ఎత్తున మెట్ట పద్ధతిలో వరి సాగు చేసేందుకు ముందుకు వచ్చారు
దీంతోఈవానాకాలం సీజన్‌లో మెట్టవరి సాగు ప్రారంభమైంది.
ఎరువులు,నీటివాడకం తగ్గడం, అదే సమయంలోదిగుబడి పెరగడంతోకర్షకులు ఈసాగు వైపు మక్కువ చూపుతున్నారు
గ్రామంలోరైతులు అయిన ఈసాల వెంకటేశ్వర్లు, దోప్ప నాగేశ్వరరావు, ఈసాల రాజాలు, మందనపు వెంకటేశ్వర్లు రాజబోయినశీను, ఈసాల లక్ష్మీనారాయణ పూణ్యెం పాపారావు, ఆగేల్లి నాగేశ్వరరావు,లుఇప్పటికే మెట్ట వరి సాగు చేస్తుండగా, వీరిని అనుసరించేందుకు మండలంలోని గ్రామాలలోచాలా మంది రైతులు సన్నద్ధం అవుతున్నారు.
సంప్రదాయకంగా వరిని సాగుచేయాలంటే నారుపోసి, మడుల్లో నీటిని నింపి దమ్ము చేసిన తర్వాత బురద నీటిలో నాట్లు వేయ్యాలి ఇందుకు ప్రాథమిక పెట్టుబడిగా సుమారుగా 8000 నుండి 10000 వరకు ఖర్చు అవుతుంది
నీటి వినియోగంతో పాటు పెట్టుబడి కూడా ఎక్కువే అవుతుంది
వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇవేవి లేకుండా సాగులో నీటి వినియోగాన్ని, పెట్టబడి ఖర్చులను తగ్గిస్తూ పర్యావరణ హితంగా మెట్ట పద్దతిలో వరి సాగును ధాన్ ఫౌండేషన్/ ఎమ్మెస్కే వారి సహకారంతో ప్రయోగాత్మకంగా ఉమ్మడిజిల్లాలోఅమలు చేస్తోంది
ఈ పద్దతిలో ట్రాక్టర్ వెనకాల (సీడ్ కం ఫర్టిలైజర్ డిల్లర్) పరికరాన్ని భిగించి భూమిలో విత్తనాలు మరియు ఎరువులు వేసి వరిని సాగు చేస్తారు గత వానాకాలం సీజన్లోమండలంలో(డ్రం సీడర్) నేరుగా విత్తనాలను వెదజల్లే పద్ధతిలో 4500 ఎకరాల్లో ఈ పద్దతిలో వరిసాగు చేయగా (ఖరీఫ్ రబీ కాలాలలో) మంచి ఫలితాలు వచ్చాయి.
దీంతో ఈ ఏడాది జిల్లాలోని 8 మండలాల్లో దాదాపు పది వేల ఎకరాల్లో మెట్ట పద్దతిలో వరి సాగు జరుగనుంది.
శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో ఈ నూతన విధానం వైపు రైతులను ప్రోత్సహిస్తోంది
సంప్రదాయ సాగుతో పోల్చితే ఎకరాకు మూడు నాలుగు క్వింటాళ్ల దిగుబడి పెరగడంతో ఈ ఏడాది చాలా మంది రైతులు ఈ విధానంలో సాగు చేసేందుకు ముందుకు వచ్చారు.
నాలుగైదేళ్లలో రాష్ట్రం మొత్తం ఈ విధానంలోనే రైతులు వరిసాగు చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నారు
జిల్లాలో ఇప్పటికే మెట్టవరి సాగు చేసేందుకు 2400 మంది రైతులు ముందుకు వచ్చారు.
రైతులు, సాగు విస్తీర్ణం పెరగడంతో 7మిషన్లు డెమో కోసము తెప్పించి రైతులకు అందించినారు విత్తనాలు ఎరువులు నాటే పరికరంతో (సీడ్ కం ఫెర్టిలైజర్ డిల్లర్) గంటలో ఓ ఎకరం చొప్పున విత్తనాలు వెయ్యవచ్చు.
యంత్రానికి సంబంధించిన ట్రాక్టర్ డ్రైవర్ ఎకరానికి 1200 రూపాయిలు మాత్రమే రైతు నుంచి తీసుకుంటాడు.
రైతుకు కొత్త టెక్నాలజీ దగ్గర చేయడం పెట్టుబడి తగ్గించి వాతావరణాన్ని రక్షించడం, పంటల దిగుబడి పెంచాలన్న ఉద్దేశంతోనే కృషి చేస్తున్నామని ధాన్ ఫౌండేషన్/ ఎమ్మెస్కే జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ లాయక్ అలీ, లోకేషన్ ఇంజనీర్ నంగునూరు వినయ్ కుమార్ పి ఈ లక్ష్మయ్య, ఆగ్రోనిస్ట్ కీర్తి.
పంట వేసిన దగ్గర నుంచి కోసే వరకు రైతులకు అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తూ తరుగుతున్న భువనములకు అనుగుణంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా దిగుబడిని పెంచే విధానాన్ని నేర్పిస్తూ అన్నదాతలను ముందుకు తీసుకెళ్తామంటున్నారు.
రైతులను ఆకర్షిస్తున్న ఈ మెట్ట వరి సేద్యం పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతున్న క్రమంలో రైతులు వ్యవసాయంలోయాంత్రికరణ లతో అభివృద్ధి చెంది ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ ముందుకు రావాలని అని అన్నారు.