నాయిని నరసింహ రెడ్డి మృతి తీరని లోటు
తెలంగాణ రాష్ట్ర తొలి హోం శాఖ మంత్రి,టీఆర్ఎస్ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కారులు నాయిని నర్సింహా రెడ్డి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నాయిని నర్సింహారెడ్డి మృతి తెలంగాణకు,టీఆర్ఎస్ పార్టీ కి తీరని లోటు అని,తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసిఆర్ వెంట నిలిచిన స్వరాష్ట్ర కాంక్ష సిద్ధించే వరకు పోరాడిన మహా నాయకులు నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి, పార్టీకి, కార్మిక లోకానికి తీరని లోటుగా అభివర్ణించారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు.