Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పారిశుద్ధ్య కార్మికులుగా మారిన ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్

-గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మెలో ఉండటంతో ప్రజాప్రతినిధులకు తప్పని తిప్పలు

-గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించి విధుల్లో చేరే విధంగా చర్య తీసుకోవాలి

యాచారం జులై 24 (నిజం చెపుతాం)
యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె లో భాగంగా గ్రామపంచాయతీ కార్మికులు విధుల్లో లేకపోవడంతో ప్రజాప్రతినిధులకు తప్పని తిప్పలుగా మారింది

కొత్తపల్లి గ్రామంలోని గత మూడు నాలుగు రోజుల నుండి ఏడవ వార్డులో డ్రైనేజీ లీకేజీ కావడంతో రోడ్లపైకి డ్రైనేజీ మురికి నీరు చేరి ప్రజలకు ఇబ్బందిగా మారిందని మురికి నీరు వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని గమనించి

ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు ఉప సర్పంచ్ కావలి జగన్ వార్డు మెంబర్ గౌని శ్రీనివాస్ గౌడ్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులుగా మారి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లీకేజీ పనులను పరిష్కరించడం జరిగింది

 

బ్లీచింగ్ పౌడర్ ని చల్లడం జరిగింది అదేవిధంగా పదవ వార్డులోని వీధిలైట్ల సమస్యను ఎంసిబి లు రిపేర్ చేసి పరిష్కరించడం జరిగింది గ్రామ ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే మేము పరిశుద్ధ కార్మికులు గా మారాల్సి వచ్చిందని తెలియజేశారు

గ్రామపంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె కు సంబంధించిన వారి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరడం జరిగింది

 

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కావాలి జగన్ వార్డు మెంబర్ గౌని శ్రీనివాస్ గౌడ్ మేడమోని శేఖర్ కాసోజు శివ తలారి సంజీవ మండల సంజీవ పాలోజు శివ తదితరులు పాల్గొనడం జరిగింది