Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇంకా మారని వాసుదేవపూర్ పాఠశాల బోర్డు

మాడ్గుల జులై 24( నిజం చెపుతాం): రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు సమీప గ్రామాలు,మండలాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలు,మండలాలు మార్పు చేర్పులు చేసిన సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలోని నాలుగు మండలాలు

తలకొండపల్లి,ఆమనగల్,మాడ్గుల,కడ్తాల్ మండలాలను రంగారెడ్డి జిల్లాలో చేర్చి సంవత్సరాలు గడుస్తున్నా పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆమనగల్ మండలంలోని వాసుదేవపూర్ గ్రామం కొనసాగుతున్నట్టు ప్రాథమికో న్నత పాఠశాల బోర్డు మారకపోవడంతో మండల ప్రజలంతా అయోమయానికి గురవుతున్నారు.

ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలంలో వాసుదేవపూర్ గ్రామం కొనసాగుతుండగా జిల్లా మారి ఏడు సంవత్సరాలు,నూతన మండలం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రాథమికోన్నత పాఠశాలలో పాత బోర్డులు దర్శనమిస్తుండడంతో మండల ప్రజలంతా అయోమయానికి గురవుతున్నారు.

ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుసింధర్ రావు స్పందించి మండల స్థాయి విద్యాధికారిపై,పాఠశాల ప్రధానోపాధ్యాయులపై చర్య తీసుకొని మారిన జిల్లా,మండలాన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాల ముఖద్వారంలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డును తక్షణమే కొత్త జిల్లా,మండలం పేరుతో ఏర్పాటు చేయించాలని మండల ప్రజలు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.