Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేణుకు ఆర్థిక సాయం అందజేత

– ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్

తుంగతుర్తి జులై 24 నిజం చెపుతాం న్యూస్

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ & పురపాలక శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా కేటీఆర్ విజ్ఞప్తి మేరకు తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు చిత్తలూరి వేణు గౌడ్ భువనేశ్వర్ లోని ఏ ఎస్ బి ఎం యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడు,

నిరుపేద కుటుంబానికి చెందిన వేణు కాలేజీ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక నాయకులు తెలియజేయడంతో తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ తన సొంత డబ్బులతో వికలాంగుడు చిత్తలూరి వేణు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు రూ.1,76,475/- చెక్కును వారికి అందజేశారు.

ఈ సందర్భంగా వికలాంగుడు, విద్యార్థి చిత్తలూరి వేణు గౌడ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన నాకు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా నా మెదటి సెమిస్టర్ కాలేజీ ఫీజు కోసం రూ.1,76,475/- చెక్కును అందజేసిన ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారికి రుణపడి ఉంటానని అన్నారు .

నియోజకవర్గంలో ఏ విద్యార్థి తన చదువును ఆపకూడదని ఉద్దేశ్యంతో తన దృష్టికి రాగానే ఆర్థిక సాయం అందించే మనసున్న మారాజు డా. ఎమ్మెల్యే గాదరికిషోర్ కుమార్ సహకారం పట్ల ప్రజలంతా హర్ష వ్యక్తం చేస్తున్నారు.

ఆయన వెంట బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు పాల్గొన్నారు