అనుమానంతో భార్యను హతమార్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
అనుమానంతో భార్యను హతమార్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు
తెలంగాణ స్టేట్ బ్యూరో జూలై 24 నిజం న్యూస్
ఖమ్మం జిల్లా..
విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. అను మానం, కుటుంబ కలహాలతో భార్యను హత మార్చిన ఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామానికి చెందిన భూక్యా సీతారాములు ఇల్లెందు సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతనికి రఘు నాథపాలెం గ్రామానికి చెందిన పార్వతి(43)తో 22 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరు ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సీతారాములు పార్వతిని హత్యచేసి పరారయ్యాడు. ఆదివారం సాయంత్రంవారి ఇంటికి వచ్చిన పార్వతి సోదరుడు ఆమె విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు……..