పట్టుబడ్డ మావోయిస్టు సానుభూతి పరుడు, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

బుధవారం ఉదయం 7.30 గంటల సమయం లో భద్రాచలం సిఐ స్వామి, భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ సురేష్ వారి సిబ్బంది తో అంబెడ్కర్ సెంటర్ నుండి రాజుపేట కాలనీ వరకు ఫుట్ పెట్రోలింగ్ చేస్తుండగా, రాజుపేట కాలనీ వద్ద రోడ్ పై ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించటంతో అతనిని పట్టుకొని అతని వద్ద ఉన్న బ్యాగ్ తనిఖీ చేయగా పేలుడు పదార్ధాలు ఉన్నవి.
ఇతని పేరు కలుమ జోగ , 26 సంవత్సరాలు, r/o పుట్టపాడు గ్రామం, కిష్టారం, సుకుమా జిల్లా, చత్తీస్ గడ్ స్టేట్.
ఇతను సిపిఐ మావోయిస్టు భావజాలం నకు ఆకర్షితుడై మొదట కలుమ దూల ఆధ్వర్యంలో బాలల సంఘం లో చేరి 2007 నుండి 2014 వరకు పని చేసాడు. అనంతరం మడకం సోమా ఆధ్వర్యంలో 2014 లో జన మిలీషియా చేరి 2016 వరకు పని చేసి తరువాత కరకు జోగ ఆధ్వర్యంలో భుంకాల్ మిలీషియా 2016 లో చేరి 2017 వరకు పని చేసాడు. ఆ తర్వాత 2017 సంవత్సరం చివరి లో నిషేధిత CPI మావోయిస్టు 8వ ప్లాటూన్ లో దూది మాస ఆధ్వర్యంలో చేరి ప్రస్తుతం అదే దళంలో పని చేయుచు PPCM/ACM రాంక్ లో వున్నాడు. అందులో పని చేస్తున్న సమయంలో 1. 2017 లో కసారాం వద్ద వాహనాలు తగులబెట్టిన కేసు, 2. 2018 లో తెట్టేమడుగు వద్ద పోలీసుల మీద కాల్పులు జరిపిన కేసు, 3. 2018 లో కసారాం నాల వద్ద పోలీసు వాహనాన్ని పేల్చివేసి 9 మంది పోలీసు సిబ్బందిని చంపిన కేసు, 4. 2019 లో కొమ్మణపాడు వద్ద పోలీసుల మీద కాల్పులు జరిపిన కేసు, 5. 2020 జనవరి లో సాకిలేరు వద్ద పోలీసులపై కాల్పులు జరిపిన కేసు, 6. ఫిబ్రవరి లో పాలోడి గుట్ట వద్ద పోలీసులపై కాల్పులు జరిపిన కేసు, 7. జూన్ లో పాలోడి CRPF క్యాంప్ పై కాల్పులు జరిపిన కేసు, 8. జులై లో వెల్కనగూడా, సిందూరుగుడా మధ్యలో రోడ్ తవ్విన కేసు, 9. సెప్టెంబర్ లో కసారాం నాల వద్ద రోడ్ తవ్విన కేసులో పాల్గొన్నాడు. ఈ రోజు ఇతను దళం నకు కావలసిన పేలుడు పదార్దాలు 5 డిటోనేటర్లు మరియు జిలేటిన్ స్టిక్స్ -50 భద్రాచలం నుండి కిష్టారం కు తీసుకొని వెళ్తుండగా ఇతనిని రాజుపేట కాలనీ వద్ద పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్ట్ కి తరలించారు.