Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కుటుంబ కలహాలే యువతిని…

*పురుగుల మందు తాగి ఆత్మహత్య

చర్ల జూలై 23 (నిజం చెపుతాం) కుటుంబ కలహాలే ఓ యువతి నిండు ప్రాణం తీసింది. పురుగుల మందుసేవించి ఆత్మహత్య చేసుకుంది

దీనికి సంబంధించిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని గొల్లకట్ట లో నివాసముంటున్న పాయం ఆకాంక్ష ( 21) హైదరాబాదులో ఇంజనీరింగ్ బీటెక్ విద్యను అభ్యసిస్తుంది. ఆమె చర్లకు చెందిన దొడ్డ పృథ్వి (23) ప్రేమించింది వివాహం చేసుకోవడానికి పృథ్వి తల్లిదండ్రులను కోరారు

తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో పృథ్వి గొల్ల కట్టలో ఒక అద్దె ఇంట్లో ఉంటూ సహజీవనం సాగిస్తున్నాడు

శనివారం వీరి ఇరువురి మధ్య కుటుంబ కలహాలు చోటు కోవడంతో ఆమె పురుగుల మందు సేవించింది కుటుంబ సభ్యులు ఆమెను భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు

వైద్య చికిత్సలు నిర్వహిస్తుండగా ఆమె మృతి చెందింది చేతికందిన కూతురు మృతి చెందడంతో ఆ తల్లి బోరున విలపిస్తోంది

ఆదివారం 4 గంటల సమయంలో ప్రధాన రహదారిపై ఆదివారం నాలుగు గంటలకు సమయం ప్రధాన రహదారిపై సుమారు 300 మందితో రాత్రిఏడు గంటల వరకు ప్రియుడి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి బయటాయించారు

దీంతో వాహనాలు స్తంభించిపోయాయి సమాచారాన్ని తెలుసుకున్న సిఐ.బి. అశోక్. ఎస్సైలు వెంకటప్పయ్య సూరి అక్కడికి చేరుకొని మృతురాలు తల్లి. కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు .

ఆకాంక్షను పృద్వి కుటుంబ సభ్యులే పురుగుల మందు పోసి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మృతికి కారకుడైన పృథ్వి ఇక్కడకు రావాలని డిమాండ్ చేశారు

పృథ్వి పరారీలో ఉండటంతో పృథ్వి తండ్రి దొడ్డ జమిస్టోన్ అక్కడికి వచ్చి పోలీసుల ముందు ఆమెకు చేయవలసిన కార్యక్రమాలన్నీ దగ్గర ఉండి చూసుకుంటామని అంగీకరించటంతో ధర్నా విరమించారు

ఆకాంక్ష కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకుపోలీసులు విచారణ చేసి కేసు నమోదు చేశారు