Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తొలిప్రేమ కు 25 యేండ్లు

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వినూత్న ప్రేమ కథా చిత్రం తొలిప్రేమ(TOLIPREMA). అప్పట్లో ఈ చిత్రం కుర్రకారు గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్. ఇప్పటి కుర్రకారు కూడా ఈ చిత్రంలోని పాటలను వింటుంటారంటే ఆ పాటలు ఎంత ఫేమసో తెలుస్తోంది.

ఈ చిత్రం జులై 24, 1998 లో అంటే సరిగా 25 సంవత్సరాల క్రితం ఈ రోజే  రిలీజైంది. కరుణాకర్ రచన, దరకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్, కీర్తిరెడ్డిలు హీరో హీరోయిన్లుగా నటించగా, వాసుకి, నగేష్, వేణు మాధవ్, అలీ, అచ్యుత్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీతంను దేవా అందించాడు. ఎస్ ఎస్ సి ఆర్ట్స్ బ్యానర్ పై జివిజి రాజు ఈ సినిమాను నిర్మించారు.

కథ విషయానికి వస్తే బాలు (PAVAN KALYAN) కుటుంబంలో చిన్న కొడుకు. చదువులో కాని మిగతా విషయాల్లో కాని నిర్లక్షంగా వ్యహరిస్తుంటాడు. అను (KEERTI) తన తాతతో గడపడానికి అమెరికా నుండి వస్తుంది. బాలు చిన్న పిల్లలను కాపాడే ప్రయత్నంలో అతని ఆటో గ్రాఫ్ కోసం ప్రయత్నించి విఫలం అవుతుంది.

బాలు ఉన్నత చదువుల కోసం ఊటీ వెళ్తుంటాడు. ఈ సమయంలో అతని కారు చెడి పోతుంది. ఆ సమయంలో అను కారు లోయలో పడిపోతుంటే ఆమెను రక్షించడం కోసం ప్రయత్నించి ఆ లోయలో అతను పడి పోతాడు. దీంతో అను బాలు చనిపోయాడనుకుంటుంది. కాని ట్రక్కు డ్రైవర్ బాలును కాపాడి ఆస్పత్రిలో చేర్చుతాడు. ఇది తెలుసుకున్న అను బాలు ఇంటికి వెళ్తుంది. అప్పటికే బాలు అనును ప్రేమిస్తుంటాడు.

కాలం గడిచే కొద్దీ అనూ, బాలులు స్నేహితులుగా దగ్గరవుతారు. బాలుకు అనూను ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం లేక పోవడంతో చెప్పలేడు. అనూ కి అమెరికాలో ఉన్నత చదువుల కోసం యూనివర్శిటీలో సీటు వస్తుంది. దీంతో ఆమె వెళ్లి పోతుండటంతో బాలు భాధపడుతుంటాడు.

అనేక పరిణామాల అనంతరం బాలు, అనూలు ఎయిర్ పోర్ట్ లో అనూ  ధైర్యం చేసి తన ప్రేమను వ్యక్తం చేయడంతో సినిమా ముగుస్తుంది.  ఈ సినిమా చివర్లో బాలుకు, తన చెల్లికి, కుటుంబానికి మధ్య వచ్చే సన్నివేశాలు కంట తడి పెట్టిస్తాయి.

ఈ సినిమా అంత్యంత ప్రజాదరణ పొందడంతో పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 16 సెంటర్లలో 100 రోజులు, 2 సెంటర్లలో 200 రోజులు ఆడింది. వరంగల్ లో 300 రోజులు ఆడింది.

దిల్ రాజు మొదటగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టింది ఈ సినిమాతోనే. ఈ సినిమాకు 6 నేషనల్ అవార్డులు, ఒక నంది అవార్డు వచ్చాయి.