Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అయ్యప్ప భక్తుల సన్నిదాన స్థల కోసం విరాళం అందజేత

– మేడే రాజీవ్ సాగర్ (తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్)

హైదరాబాద్ జూలై 23 నిజం చెపుతాం న్యూస్

వెలుగుపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులు తమకు సొంత సన్నిధానం ఇటీవల నిర్మాణం జరిగింది గతంలో ఆ సన్నిదానా స్థలం కొరకు అదే గ్రామ వాస్తవ్యులు తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ కలిసి సన్నిధానం స్థలం ఇప్పించాలని కోరగా

స్పంచిన రాజీవ్ సాగర్ 2,00,000 లక్షలు అవుతుందని తెల్సుకుని నేను ఇప్పిస్తా అని మాటిచ్చారు

అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ తన నివాసంలో 1,00000 లక్ష రూపాయలు స్థలానికి అడ్వాన్స్ గా ఇచ్చారు మిగతావి తొందర్లోనే ఇస్తా అని హామీ ఇచ్చారు ..

ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నా సొంత గ్రామం నుంచి దేవుని పని కోసం నాకూ అవకాశం రావడం నిజంగా ఆ అయ్యప్ప దేవుని అదేశంగా భావించి నాకు ఇచ్చిన పని నిర్వర్తించానని అన్నారు..

40 రోజులపాటు భక్తి నిష్టలతో అయ్యప్ప మాల ధారణలో ఉండే భక్తులకు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు…

ఈ కార్యక్రమం లో : వెలుగుపల్లి గురు స్వామి గుండా శ్రీనివాస్, చుంచు శ్రీధర్, కొరబోయిన వెంకటనారాయణ, నరాల సురేష్, మైసా పరుశరాములు తెలంగాణ జాగృతి నాయకులు గొడుగు మహేందర్, సోలిపురం ఉపేందర్ రెడ్డి, తూము యాకయ్య తదితరులు పాల్గొన్నారు…