భరించలేని దుర్వాసన, దోమలతో సహజీవనం
__20వ వార్డు ప్రజల ఆవేదన,
___పిల్లలకు పెద్దలకు దోమలు కుట్టడం వలన రోగాల పాలవుతున్నాం.
___వార్డు కౌన్సిలర్ తాళ్ల పెళ్లి జగన్ నిర్లక్ష్య ధోరణి.
___పట్టించుకోని మున్సిపాలిటీ, కమిషనర్.
మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూలై 23,( నిజం న్యూస్):
మహబూబాబాద్ పట్టణంలోని నడి బొడ్డున ఉన్న పత్తిపాక ప్రజల పరిస్థితిని పట్టించుకోని మునిసిపాలిటీ.
20వ వార్డు కు సంబంధించిన కౌన్సిలర్ తాళ్ల పెళ్లి జగన్ వార్డు ప్రజల పరిస్థితిని పట్టించుకోవడంలేదని 20వ వార్డు మహిళలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
వార్డులో మురికి కాలువ లోని చెత్తా చెదారం నెలల తరబడి తొలగించక పోవడం వలన దోమలు వాలి సాయంత్రం కాగానే ఇళ్లలోనికి దూసుకు వచ్చి పిల్లలను పెద్దలను తీవ్రంగా బాధిస్తున్నాయి.
ఈ దోమల వలన పిల్లలకు, పెద్దలకు మలేరియా, డెంగు, చికెన్ గునియాల లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక పక్కనే మురికి కాలువ ఉండటం వలన దుర్వాసన భరించలేక ముక్కుపుటాలు అదురుతున్నాయి. ఈ మురికి కాలువ ఎదురుగా “యస్కొల్”చర్చి కలదు.
ప్రతి ఆదివారం ప్రార్థనలు ఈ చర్చిలో జరుగుతాయి. చుట్టుపక్కల నుండి భక్తులు ప్రార్థన కొరకు చర్చికి రావడం జరుగుతుంది. పక్కనే ఉన్న మురికి కాలువ వల్ల భరించలేని దుర్వాసన వస్తుందని “యస్కోల్” చర్చి ఫాదర్ సామ్యూల్ “నిజం న్యూస్” ప్రతినిధికి తెలిపారు.
గత రెండు నెలల నుండి మా ఏరియాకు మంచినీరు రావడం లేదని మహిళలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
మిషన్ భగీరథ పైపులు వేశారు.
నల్లాలు బిగించ పోవడం వల్ల కొన్ని దిక్కుల పైపులు పగిలి నీరు రావడంలేదని వాటిని ఇప్పటివరకు కూడా రిపేరు చేయలేదని, ఈ విషయాలన్నింటినీ స్థానిక కౌన్సిలర్ జగన్ కు, మున్సిపల్ కమిషనర్ కు, కలెక్టర్కు విజ్ఞాపనలు కూడా చేశామని పాస్టర్ సామ్యూల్ మహిళలు “నిజం న్యూస్” కు తెలిపారు.
కౌన్సిలర్ జగన్కు 50 లక్షల రూపాయల ఫండ్స్ వచ్చిన ఇక్కడి కాలువను కట్టించకుండా తన ఇష్టం ఉన్న కాడ నిధులను వినియోగించాడని వారు విమర్శించారు. ఇక మున్సిపల్ కౌన్సిలర్ కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వారు తీవ్రంగా విమర్శించారు.
ఇప్పటికైనా మమ్ములను ఈ దోమల బారి నుండి, దుర్వాసన నుండి కాపాడాలని, మంచినీటి ఇబ్బంది తోలిగించాలని 20వ వార్డు మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు.