Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం సరికాదు

ధిమికి ధిమికి డ్యాన్స్ లతో ప్రజలను మోసం చేయలేరు.

…కాంగ్రెస్ అయాంలో చేసిన అభివృద్ధి తప్పా..,

…బిఅరెస్ లో ఏం అభివృద్ధి చేశావో ప్రజలకు చెప్పాలి.

…రెడ్యానాయక్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

…అభివృద్ధి పేరుతో పార్టీ ప్రచారం సాగుతోంది.

…కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జీ జాటోత్ రామచంద్రునాయక్.

కురవి,నిజంచెపుతాం,జూలై 23:

ధిమికి ధిమికి డ్యాన్స్ లతో ప్రజలను మోసం చేయలేరని, నియోజకవర్గంలో ఇసుక దోపిడీ చేస్తున్న మీకు వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలే రెడ్యాకు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జీ జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ నాయక్ కుమారుడి జన్మదిన వేడుకలకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ

నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ బిఆర్ఎస్ లో అభివృద్ధి పేరు మీద పోయిన తర్వాత మీరు ప్రభుత్వ పరంగా ప్రజలకు రావాల్సిన ఏ ఒక్క పథకాన్ని ప్రజల్లో పూర్తిగా తీసుకోలేక పోయారు.అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నిరుపేదలకు ఇచ్చిన ఆసెండ్ భూములు, ఇందిరమ్మ పట్టాలను లాక్కున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా

ఈ నియోజకవర్గంలో పకృతి వనాలు, స్మశానవాటిక పేరు మీద ఆసెండ్ భూములను లాక్కున్నది వాస్తవం కాదా..? డోర్నకల్ నియోజకవర్గంలో ఇసుక దోపిడీ చేస్తుంది మీరు కాదా..!ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరు మీద ప్రజాధనాన్ని దారిమల్లిస్తుంది వాస్తవం కాదా..? ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15 నుంచి 20 లోపు జీతాలు రాకపోవడం అనేది వాస్తవం కాదని,

టిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థి లోకం పీజీలు డబల్ పిహెచ్డీలు చేసినంక కూడా ఉద్యోగాలు రాక అవస్థలు పడుతుంటే వారి తల్లిదండ్రులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తరుగు పేరు మీద మీ ఐకెపి సెంటర్లలో మీ సొసైటీ చైర్మన్ ల మీ సొంత రైస్ మిల్లులో తరుగు పేరు మీద రైతులను మోసం చేసింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

ఐకెపి సెంటర్లలో నెలలు తరబడి వానకు తడుస్తూ ఎండకు ఎండుతుంటే రైతన్నలు ఇబ్బంది పడుతుంటే మీరు మొద్దు నిద్రలో తండ్రి కూతురు ఉన్నది వాస్తవము కాదని ఆయన దుయ్యబట్టారు.

మిమ్ములను ఎమ్మెల్యేగా,మీ కూతురిని ఎంపీగా చేస్తే.., ఇదే ప్రజా లోకం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కనబడుతుంది తప్పా బిఆర్ఎస్ లోకి పోయిన తర్వాత అభివృద్ధి చూపించగలరా అని ఆయన సవాలు విసిరారు.

అది ప్రశ్నించినందుకు ప్రజలపై కేసులు బనహించి అమాయక ప్రజానీకాన్ని మీరు పోలీసు బలగాలతో భయభ్రాంతులకు గురిచేసింది వాస్తవాలు కాదా అని, డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న పోలీసులు ఎస్సైలు,సిఐలు, కానిస్టేబుల్స్,ప్రత్యేక బలగాలతో ఏదో ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన జరిగినప్పుడు ప్రత్యేక ఫోర్స్ ని దించినట్టుగా ప్రత్యేక బస్సులలో బలగాలని దించారు ముందే తెలిసి కూడా బయన్డర్లు చేసుకుంటూ అభివృద్ధి పేరు మీద పార్టీ ప్రచారం చేసుకుంటుంది వాస్తవాలు కాదా రెడ్యానాయక్ ఇప్పటికైనా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.

నేను కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి పోయిన తర్వాత నా బుద్ధి తక్కువ అయిందని, అందుకే అభివృద్ధి చేయలేకపోయానని చెప్పుకోవాల్సిన మీరు ఈసారి కూడా ఎమ్మెల్యే నేనే పోయినసారి చివరి ఎన్నికనే చెప్పుకున్నారు.

ఈసారి కూడా నేనే ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకుంటున్నారు.

తెలంగాణ యావత్ ప్రజానీకానికి ప్రతి నియోజకవర్గానికి మోసం చేసిన కేసీఆర్ ని, డోర్నకల్ లో రెడ్యానాయకుని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని మీరు మీకు కనపడుతూనే ఉంది. మీరు కోలాటాలు బాధ్యులతో, పోలీస్ యంత్రాంగంతోనో, ప్రజా ప్రతినిధులతోనూ, అధికారులతోనూ దిమి దిమి డ్యాన్సులు చేసిన మాత్రాన ప్రజల కష్టాలు పోయాయని అనుకోవడం మీ తప్పు ఇప్పటికైనా కండ్లు తెరవండి రెడ్యానాయక్ మీ డ్యాన్సులు ఆపండి, తిక్క తిక్క కేసులు పెట్టే ప్రయత్నం మానేయండి. డోర్నకల్ నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని,

మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, రెడ్డినాయక్ ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి బుద్ధి తెచ్చుకొని మీ గౌరవాన్ని కాపాడుకోవాలని రామచంద్రనాయక్ సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండి శ్రీనివాస్,కొరివి మండల అధ్యక్షులు అంబటి వీరభద్రం,కొరివి టౌన్ ప్రెసిడెంట్ నారాయణ రాజేందర్ కుమార్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కామెండ్ల వీరన్న,కోర్ని అనిల్,భూక్య సుందర్,మాలోత్ గణేష్,భూక్య మోతిలాల్,బానోత్ రమేష్,భూక్య భద్రు నాయక్,బానోత్ బాలు నాయక్,మూడు లింగన్న తదితరులు పాల్గొన్నారు.