మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

బూర్గంపాడు మండలం లోని కోయగూడెం గ్రామ పంచాయతీలో POW మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. POW రాష్ట్ర నాయకురాలు నిర్మల మాట్లాడుతూ దేశంలో మహిళల భద్రత కు రక్షణ లేకుండా పోయిందని, ఉత్తరప్రదేశ్ కు చెందిన మనీషా, ఖమ్మంలోని 13 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోయగూడెం గ్రామ సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి , ఆదిలక్ష్మి, జి రవి, వైయస్ రెడ్డిన్న, దుర్గారావు, నరసింహారావు, తిరుపతమ్మ, గ్రామ మహిళలు పాల్గొన్నారు.