Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒకే ఏడాది చిరంజీవి 13 సినిమాలు విడుదల..అందులో రెండే ఫ్లాప్

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) కి  1983 సంవత్సరం మరుపురాని సంవత్సరం. ఆయన అభిమానులకు కూడా ఈ ఏడాదిని మర్చి పోలేరు. ఈ సంవత్సరం నుండే చిరంజీవి నటించిన చాలా సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ పై చెరగని ముద్ర వేసారని చెప్పవచ్చు.  ఒకే ఏడాది చిరంజీవి 13 సినిమాలలో హీరోగా నటించగా, మా ఇంటి ప్రేమాయణం సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు.

1983లో విడుదలైన సినిమాలు ఇవే

1. ప్రేమ పిచ్చోళ్లు. దీనికి ఎ. కోదండ రామరెడ్డి(kodanda rami reddy) దర్శకత్వం వహించాడు. జనవరి 14వ తేదీ విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద ఎవరేజ్ గా నిలిచింది.

2. పల్లెటూరి మొనగాడు. దీనికి ఎస్ఎ చంద్రశేఖర్ (s. chandra shekar) దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 5 వ తేదీ విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

3. అభిలాష. దీనికి ఎ. కోదండ రామరెడ్డి(kodanda rami reddy) దర్శకత్వం వహించాడు. మార్చి 11 వ తేదీ విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

4. ఆలయ శిఖరం. దీనికి  కోడి రామకృష్ణ(Kodi Rama Krishana) దర్శకత్వం వహించాడు. మే నెల 7వ తేదీ విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద  గా ఎవరేజ్ గా నిలిచింది.

 

5. శివుడు శివుడు శివుడు. దీనికి ఎ. కోదండ రామరెడ్డి(kodanda rami reddy) దర్శకత్వం వహించాడు. జూన్ 9 వ తేదీన విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

6. పులి బెబ్బులి. దీనికి కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వం(ksr das) వహించాడు. జూన్ 16 వ తేదీన విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద ఎవరేజ్ గా నిలిచింది.

7. గూఢ చారి నెంబర్ 1. దీనికి కోడి రామకృష్ణ(Kodi Rama Krishana) దర్శకత్వం వహించాడు. జూన్ 30 వ తేదీన విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

8. మగమహారాజు. దీనికి విజయ బాపినీడు(vijaya bapineedu) దర్శకత్వం వహించాడు. జులై 17 వ తేదీన విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

9. రోషగాడు. దీనికి కె ఎస్ ఆర్ దాస్(ksr das) దర్శకత్వం వహించాడు. జులై 29వ తేదీ విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద బిలో ఎవరేజ్ గా నిలించింది.

10. సింహాపురి సింహాం. దీనికి కోడి రామకృష్ణ(Kodi Rama Krishana) దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 27వ తేదీన విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

11. ఖైదీ. దీనికి ఎ. కోదండ రామరెడ్డి దర్శకత్వం(kodanda rami reddy) వహించాడు. అక్టోబర్ 28 వ తేదీన విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద బ్లక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

12. మంత్రిగారి వియ్యంకుడు. దీనికి బాపు(Bapu) దర్శకత్వం వహించాడు. నవంబర్ 4 తేదీన విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

13. సంఘర్షణ. దీనికి కె. మురళీ మోహన్ రావు(murali mohan rao) దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 29వ తేదీన విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

వీటిలో శివుడు శివుడు శివుడు, సింహాపురం సింహా రెండు సినిమాలు మాత్రమే అట్టర్ ఫ్లాప్ కాగా మిగిలిన 11 సినిమాలు హిట్ అయ్యాయి. అభిలాష, ఖైదీ, మగమహారాజులు డైరెక్ట్ గా శత దినోత్సవాలను జరుపుకున్నాయి.

దీనిలో ఖైదీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం విశేషం. ఖైదీ తరువాత వచ్చిన చిరంజీవి  సినిమాలకు భాక్సాఫీస్ వద్ద పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావడం విశేషం.

ఈ 13 సినిమాలతో రాధిక 7 సినిమాలతో హీరోయిన్ నటించడం మరో విశేషం.

13 సినిమాలతో ఎ. కోదండరామిరెడ్డి 4 సినిమాలకు దరకత్వం వహించాడు. కోడి రామకృష్ణ 3 సినిమాలకు, కె ఎస్ ఆర్ దాస్ 2 సినిమాలకు దరకత్వం వహించారు.

అతిథి పాత్రలో నటించిన మా ఇంటి ప్రేమాయణం సినిమాను చిరంజీవి స్నేహితుడు ప్రసాద్ బాబు నిర్మించడంతో దానిలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవికి క్లైమాక్స్ లో  ఒక పాట, ఒక పైట్ ఉంటాయి.