Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జోగాపూర్ చెరువులో వింత చేప

చందుర్తి జులై 22 (నిజం న్యూస్):

చందుర్తి మండలం వర్షాల కారణంగా చెరువులన్నీ కూడా నీటితో నిండి కళకళలాడుతున్నాయి.

మండలంలోని జోగాపూర్ గ్రామంలో గల చెరువు నీటితో నిండి జలమయమైంది.

చాలామంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వల వేసి చూడగా వలలో చాలా చేపలతో పాటు మరొక చేప కనపడింది. ఆ చేపను చూసిన నాగం మల్లయ్య కి వింత అనుభవం ఎదురైంది. తన వలలో పడిన చేపను ఊరిలో అందరికీ చూపించాడు.

చేపను చూసిన వారంతా ఇంతవరకు కూడా ఇలాంటి చేప చూడలేదు అని అనుకున్నారు. ఆ నోటా ఈ నోటా పడటంతో ఊరిలోని ప్రజలు కూడా చేపను చూడడానికి రావడం విశేషం