Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కంటివెలుగు‌లో ఇచ్చిన కళ్ళద్దాల తో మంత్రి సత్యవతి

ప్రచారంలోనే కాదు, ఆచరణలోనూ అంతే నిబద్దత.!!

కంటివెలుగు‌లో ఇచ్చిన కళ్ళద్దాలు వాడుతున్న మంత్రి సత్యవతిరాథోడ్.

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూలై 21,( నిజం న్యూస్):ప్రభుత్వ పధకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడంలో ముందుండే చాలామంది నాయకులు, ప్రజాప్రతినిధులు ఆచ‌రణలోకి వచ్చేసరికి అంతగా పట్టించుకోని సంఘటనలు చాలా ఎక్కువగా చూస్తుంటాం..

కానీ రాష్ట్రానికి మంత్రిగా ప్రభుత్వ పధకాలను వివరించడమే కాదు, అంతే నిబద్దతో ఉపయోగిస్తూ తన కమీట్ మెంట్ ను మరోసారి చెప్పకనే చెప్పారు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్..

కంటివెలుగు కార్యక్రమానికి రావడం పరీక్షలు చేయించుకుంటూ, కళ్ళద్దాలు పెట్టుకుంటూ పోటోలు దిగిన ప్రముఖులను చాలామందిని చూసాం. కానీ కంటివెలుగు‌ కార్యక్రమంలో ఇచ్చిన కంటిఅద్దాలను స్వంత అద్దాలా ఆరోజు నుండి ఈరోజు దాకా మంత్రి సత్యవతిరాథోడ్ వెంట ఉంచుకొని వాడుతున్నారు.

మహబూబాబాద్ లో మీడియా సమావేశానికి వచ్చిన సందర్భంగా కంటివెలుగు కళ్ళద్దాల బాక్స్ లోంచి అద్దాలు తీసుకుంటున్న మంత్రి సత్యవతిరాథోడ్ ను గమనించిన పలువురు విలేకరులు మీరు కంటోవెలుగు అద్దాలే వాడుతారా అని ప్రశ్నించగా??

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమన్నారు. నేను తీసుకున్న కంటి అద్దాలనే ఉపయోగిస్తాను. కంటిఅద్దాలు తీసుకున్న వాల్లంతా వృద్దాచేయకుండా మంచి నాణ్యత ఉన్న ఈ కళ్ళద్దాలు ఉపయోగించాలని కోరారు.