Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మినీ వైన్స్ లను తలపిస్తున్న గ్రామాలలో కిరాణా షాపులు

-యదేచ్చగా గ్రామాలలో అక్రమ మద్యం

– విక్రయాల చోద్యం ఆప్కారి అధికారులు

వనపర్తి బ్యూరో జూలై 22 ( నిజం చెపుతాం ) వనపర్తి జిల్లా పెబ్బేర్ మండల గ్రామాలలో జోరుగా అక్రమ మద్యం విక్రయాలు గ్రామాలలో పేరుకే కిరాణా షాపులు చేసేది మొత్తం అక్రమంగా మద్యం విక్రయం ఉద్దెర అడుగుతే చాలు ఇచ్చేది క్వాటర్ రాసేది రెండు క్వాటర్లు మరుసటి రోజు ఒక క్వాటర్ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లిన బాధితుడికి చుక్కలు చూపిస్తున్న కిరాణా షాపు యాజమాన్యులు.

ఏదైనా కొన్ని కిరాణా షాపులలో వంట సామాగ్రి కొందామని పోతే మద్యం తప్ప మిగతా ఏ ఒక వస్తువు దొరకదు ప్రతి రోజు తెల్లవారుజామున 4,5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు జోరుగా విక్రయాలు.ఒక క్వాటర్ పైన 10 నుండి 20 రూపాయలు లాభం పొందుతు సామాన్యుడిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
అధిక డబ్బులు వసూలు చేస్తూ సామాన్యుడిని నడ్డి విరుస్తున్న కిరాణా షాపు యజమానులు
రోజంతా కష్టపడి మద్యం సేవించేందుకు షాపుకు వెళ్లి ఒక క్వాటర్ తీసుకుని మద్యం సేవించిన బాధితుడికి స్టాప్ రూపంలో గాని ఇంకా అనేక రూపంలో అధిక డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది.

ఇదేంటి అని బాధితుడు అడుగుతే తాగితే గుర్తుండదా ఏమేమి తీసుకున్నావో గుర్తు చేసుకో అని ఆ బాధితుడుపై ఆగ్రహానికి గురవడంతో చేసేది ఏమీ లేక వారు ఎంత చెప్తే అంత డబ్బులు ఇవ్వడం తప్పదు.
మద్యం తీసుకుంటున్న బాధితుడికి చుక్కలు చూపిస్తున్న యజమానులు ఉద్దెర ఒక వాటర్ తీసుకుంటే రెండు క్వాటర్లు తీసుకున్నట్లు రాసి పెడతారు

డబ్బులు కట్టేందుకు వెళ్లిన బాధితుడికి రెండు క్వార్టర్ల లెక్క చెప్పడంతో నేను ఒకటే క్వాటర్ తీసుకున్న కదా రెండు రాసినావు ఎందుకు అని అడిగితే తాగిన మైకంలో తీసుకున్నావు.

ఉద్దెర ఒకటే ఇస్తా రెండు క్వార్టర్లు ఇవ్వను అని నేను చెప్పినప్పటికీ నువ్వే గొడవపడి తీసుకున్నావ్.అని అనేక కారణాలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. లేదు అని ఎవరైనా తిరగబడితే వారిని బండ బూతులు తిడుతూ కొట్టేందుకు వెళ్తున్న కిరాణా షాపులో యాజమాన్యులు.

లంచాల ముసుగులో అధికారులు ఇంత జరుగుతున్న చేతి కందినంత మామూలు వసూలు చేస్తూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నఆప్కారి అధికారులు.వారి కనుసైగలోనే జోరుగా గ్రామాలలో అక్రమ మధ్య విక్రయాలు కొనసాగుతున్నాయి.