Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బ్రో ట్రైలర్ వచ్చేసిందోచ్

పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ అభిమానులు చానళ్ళు గా ఎదురుచూస్తున్న బ్రో ట్రైలర్ ను శనివారం విడుదల చేశారు.

ఈ ట్రైలర్లో సాయి ధరమ్ తేజ్ టైం లేదు… టైం లేదు అంటూ కాలంతో పరిగెడుతున్న సన్నివేశాలు కనిపించాయి.

పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ లు ఒకే సినిమాలో కనిపిస్తున్నట్టు మెగా అభిమానులకు ఈ సినిమా కనుల పండుగగా మారనుంది.

సోషియో ఫాంటసీ కథతో  రూపొందుకుంటున్న ఈ చిత్రం నకు నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దైవంగా కనిపించనుండగా సాయి ధరంతేజ్ కు జోడిగా కనిపించనుంది.

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సిత్తం నకు రీమేగా ఈ చిత్రం రూపు దిద్దుకుంటుంది.

దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ చిత్రం ఈనెల 28న థియేటర్లలోనికి రానున్నది.

ట్రైలర్లు పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు మెగా అభిమానులను అలరిస్తున్నాయి.

అందరూ టైంలో ముందుకు వెళుతుంటారు నువ్వు ఒక్కడివి మాత్రమే వెనక్కి వెళ్తున్నావు అని పవన్ కళ్యాణ్ చెప్తున్న డైలాగులను బట్టి ఈ సినిమా దేవుడికి, భక్తుడికి మధ్య జరిగే సినిమాలా. అనిపిస్తుంది.

నేను చచ్చి బతికాను అనుకుంటే బతికి చస్తున్నాను… అని సాయిధరమ్ తేజ్ అన్న డైలాగులను చూస్తే ఈ సినిమాలో సాయి ధరంతేజ్ కు వచ్చే కష్టాల నుండి పవన్ కళ్యాణ్ కాపాడుతున్న పాత్రలో దేవుడిగా నటిస్తున్నట్టు తెలుస్తుంది.

ఏదేమైనా ఈ సినిమాలో ఏమేమి విశేషాలు ఉన్నాయో… ఎవరి పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే మరో ఆరు రోజులు ఆగాల్సిందే.