Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి

మల్టీ జోన్ ఐజి వన్.. చంద్రశేఖర్ రెడ్డి

చర్ల జూలై 22 (నిజం చెపుతాం) పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని మల్టీజోన్ వన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు ఏజెన్సీ ప్రాంత మైన చర్ల దోమ్మగూడెం పోలీస్ స్టేషన్లను ఆయన సందర్శించారు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ని ప్రస్తుత పరిస్థితులను ఆయనకు వివరించారు అనంతరం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ఐజి పరిశీలించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసి పోలీసు అధికారులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు

వరద ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు

అనంతరం వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు చేపడుతున్న చర్యలను స్వయంగా ఆయన పరిశీలించారు

ఆయన వెంట భద్రాచలం ఏ ఎస్ పి పరితోజ్ పంకజ్. ఓ ఎస్ డి సాయి మనోహర్. సి ఆర్ పి ఎఫ్ డి ఎస్ పి రేవతి. చర్ల సీఐ.బి అశోక్ .దుమ్మగూడెం సీఐ దోమల రమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు