Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బ్రాడ్ మన్ సరసన చేరిన కోహ్లీ

ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 5 సంవత్సరాల తర్వాత విదేశాల్లో టెస్ట్ ల్లో సెంచరీని సాధించాడు.

చివరగా 2018 డిసెంబర్ లో అస్ట్రేలియా(AUSTRALIA) పర్యటనలో చివరగా సెంచరీ సాధించాడు. 34 సంవత్సరాల కోహ్లీ(KOHLI) తన 500 మ్యాచ్ లో సెంచరీని వెస్టిండీస్ (WEST INDIES) పై సాధించడం విశేషం.

500 మ్యాచ్ లను ఆడిన భారతీయ బ్యాటర్లు సచిన్ (SACHIN), ద్రవిడ్ (DRAVID), మహేంద్ర సింగ్ ధోనీ (DHONI)ల సరసన కోహ్లీ చేరాడు.

మొదటి రోజు ఆటలో ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(sewag) ను (8586)ను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన  భారతీయ భ్యాటర్లలో ఐదో వాడిగా నిలిచాడు.

వెస్టిండీస్ పై కోహ్లీకి ఇది మూడో సెంచరీ, వెస్టిండీస్ లో రెండో సెంచరీ. టెస్ట్ ల్లో  29 సెంచరీతో అస్ట్రేలియా ఆటగాడు డాన్ బ్రాడ్ మన్ (DON BRAD MEN)సరసన చేరాడు.

భారతీయుల తరుపున అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ , ద్రవిడ్, సునీల్ గవాస్కర్ తర్వాత నాలుగో వాడిగా రికార్డు నెలకొల్పాడు.

ఇంటర్ నేషనల్ క్రికెట్ లో 76 వ సెంచరీని సాధించాడు.

వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్ట్ మొదటి ఇన్సింగ్స్ లో భారత్ తరుపున కోహ్లీ 121 పరుగులను సాధించగా రోహిత్ శర్మ 80.  రవీంద్ర జడేజా 61, యశస్వి జైశ్వాల్ 57, రవిచంద్ర అశ్విన్ 56 పరుగులను చేసి 486 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

వెస్టిండీస్ మొదటి ఇన్సింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. క్రెగ్ బ్రాత్ వైట్ 37 పరుగులు చేసి అవుటవ్వగా, క్రిక్ మెకంజీ 14 పరుగులతో ఆడుతున్నాడు. రవీంద్ర జడేజా ఒక వికెట్ ను తీసుకున్నాడు.

వెస్టిండీస్ 352 పరుగులను వెనుకబడి ఉంది.