Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అపోలో -11 కు 1,517 కోట్లు కాగా చంద్రయాన్ -3 కు 615 కోట్లే

చంద్రయాన్ 3 మిషన్ బడ్జెట్ 615 కోట్లు కాగా, 1964-73 సంవత్సరాల్లో అమెరికా ఒక్కో ప్రాజెక్ట్ కు 1517 కోట్లను ఖర్చు చేసింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడి పైకి రాకెట్లను పంపి తమ రోవర్లను సురక్షితంగా దింపగలిగాయి.

1969 జులై 16న చంద్రుడి పైకి అమెరికా అపోలో 11 ను పంపారు. దీనికి గాను అమెరికాకు 4 రోజులు మాత్రమే పట్టగా, 1959లో రష్యాకు చెందిన లూనా 2 వ్యోమ నౌక కేవలం 34 గంటల్లోనే చంద్రున్ని చేరుకుంది.

మన చంద్రయాన్ మాత్రం చంద్రుడు వద్దకు చేరుకోవడానికి 40 రోజులు పడుతుంది. ఎందుకని ప్రతీ భారతీయుడు ఆలోచిస్తున్నాడు.

చంద్రుడిపైకి నేరుగా ల్యాండ్ కావాలంటే భారీ రాకెట్లు కావాలంటున్న శాస్త్రవేత్తలు. ఇంధనం కూడా భారీ పరిమాణంలో అవసరం అవుతుంది. దీనికి బడ్జెట్ చాలా పెద్ద మొత్తంలో అవసరం అవుతుంది.  అయినా అంత తక్కువ సమయంలో ల్యాండ్ కావాల్సిన అవసరం ఏముంది. సమయమెంతైనా సురక్షింతంగా ల్యాండ్ అయితే సరిపోతుంది కదా ఇదే మన శాస్త్రవేత్తలు ఆలోచించింది.

పెద్ద బడ్జెట్ తో  సినిమా తీసే ఖర్చుతో చంద్రునిపైకి రోవర్లను తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత తక్కువ బడ్జెట్ తో మిషన్ ను పూర్తి చేయడం అన్నది చాలా గొప్ప విషయం. దీనికి భారత శాస్త్ర వేత్తలను చూసి ప్రతీ భారతీయుడు గర్వించాలి. వారు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో తెలుసుకోగలగాలి.