Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇది మలేషియా ఎంహెచ్ 370 విమాన భాగమా..?

చంద్రయాన్ 3 కి ప్రయోగానికి సంబంధించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడం వల్ల జులై 17వ తేదీన అస్ట్రేలియా లోని సముద్ర తీర ప్రాంతంలో చంద్రయాన్ 3 కి సంబంధించిన భాగాలు పడి పోయాయని పెద్ద వార్త వినిపించింది.

నిజంగా సముద్ర తీరంలో ఒక వస్తువైతే కనిపించింది. అయితే ఇది అసలు చంద్రయాన్ 3 కి సంబంధించినదేనా అని అనుమానాలు లేక పోలేదు.

అస్ట్రేలియా తీరంలో కనిపించిన మెటల్ వస్తువు రెండు మీటర్ల పొడవుంది. అస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ కూడా దీనిపై ట్టిట్టర్లో ట్టీట్ చేసింది. ఈ వస్తువు ఎక్కడి నుండి వచ్చిందో రీసెర్చి చేస్తామని వారు చెప్పారు. వాళ్ల అంచనా ప్రకారం ఒక విదేశీ ప్రయోగ రాకెట్ లోని భాగమని అనుకుంటున్నారు.

కాని ఇది నిజం కాదు. ఎందుకంటే చంద్రయాన్ 3 ఇది కనిపించిన నాటికి అప్పటికి ప్రయోగించబడి కేవలం మూడు రోజులే. కాని సముద్రంలో దొరికిన వస్తువు ఎప్పటి నుండో నీటిలో ఉంటే ఏ విధంగా చెడి పోయి ఉంటుందో అలా ఉంది.

2014లో మలేషియాకు చెందిన ఒక విమానం మాయం అయింది. ఇప్పటికి కనిపించలేదు. ఈ విమానం మలేషియా నుండి  బీజింగ్ వెళ్ళాల్సింది. కాని ఆ రోజు ఆకాశంలో సడన్ గా కనిపించకుండా పోయింది. దీనిని బట్టి చూస్తే ఇది ఎంహెచ్ 370 విమాన భాగాలని కొందరు అనుకుంటున్నారు.

ఈ వస్తువు పైన ఇక్కడ కనిపిస్తున్న పదార్ధం బర్నకల్ అని అంటారు. బర్నకల్ అనేది ఒక సముద్ర జీవి. ఈ జీవ సముద్రంలో ఉంటే రాళ్లకు, ఓడలకు అంటుకుంటుంది. ఇది అంటుకోవడానికి కనీసం నెల రోజులు పడుతుంది.

దీనిని బట్టి చూస్తే ఈ వస్తువు చంద్రయాన్ 3 కి సంబంధించిన కాదని తేలుతుంది.