Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో త్వరలో వైద్య కళాశాలకు శంకుస్థాపన

– వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

– ఇరువది ఎకరాల స్థలంలో అద్భుతంగా వైద్య కళాశాలను నిర్మించాలని నిర్ణయం.

– శ్రీ లక్ష్మీనరసింహస్వామి వైద్య కళాశాల అని నామకరణం

యాదగిరిగుట్ట జూలై21 (నిజంచెపుతాం)

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో త్వరలో వైద్య కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు.

సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఆరోగ్య శాఖ మంత్రిహరీష్ రావు సమక్షంలో యాదాద్రిలో వైద్య కళాశాల శంకుస్థాపన చేయుటకు స్థలం నిర్ణయించుట కొరకు సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ,జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి,డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ శ్రీ రమేష్ రెడ్డి,ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డిమరియు వై టి డి ఏ, పైస్ చైర్మన్ శ్రీ కిషన్ రావులు పాల్గొన్నారు.

సమావేశము నిర్వహించి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో ఇరువది ఎకరాల స్థలంలో అద్భుతంగా వైద్య కళాశాలను నిర్మించాలని నిర్ణయించారు.

వైద్య కళాశాలతో రాబోయే కాలంలో భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అందుబాటులోకి తేవాలని కళాశాల పేరు కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వైద్య కళాశాల అని నామకరణం నిర్ణయించడం జరిగింది.

ఇట్టి సమావేశంలో మూడు చోట్ల స్థలమును గుర్తించి అట్టి ప్రతిపాదన విషయాన్ని ముఖ్యమంత్రి  తెలియపరచి తుది స్థల నిర్ణయము పూర్తయిన తర్వాత వెంటనే శంకుస్థాపన కార్యక్రమమునకు చేస్తామన్నారు.

తగు సూచనలు చర్యలు తీసుకోవాల్సిందిగా అందరూ అధికారులకు ఆదేశించడం జరిగింది.