Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వినియోగదారుల జేబులకు చిల్లులు

విద్యుత్ ఉద్యోగుల లీలలు

మహబూబాద్, టౌన్ రిపోర్టర్, జూలై 21,( నిజం న్యూస్)

మహబూబాద్ పట్టణంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు 30 రోజులకు కరెంటు బిల్లు తీయాలి కానీ 30 రోజుల తర్వాత 31 నుండి 40 రోజుల వరకు బిల్లులు కొట్టి ఇస్తున్నారు ఈ విధంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగిస్తున్నారు

100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి మూడు రూపాయల 60 పైసలు (ఒక్కొక్క యూనిట్ కాస్ట్) రెండు రోజులు డిలే చేయడం వల్ల రెండు రోజులలో ఆరు యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వస్తుంది అంటే అప్పుడు 101 యూనిట్ దాటితే పవర్ యూనిట్ ధర ఆరు రూపాయల 90 పైసలు పడుతుంది

ఇప్పుడు అనవసరంగా ఆరు రూపాయల 90 పైసలు లెక్క ప్రకారం కట్టాలి అప్పుడు 101×6.90=690 రూపాయలు కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్కు 390 రూపాయలు తేడా690-390=300 అదనం ఈ విధంగా విద్యుత్ ఉద్యోగుల లీలలు ఉంటున్నాయి

దీనివలన రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ప్రభుత్వానికి అప్పనంగా ప్రజల వద్ద నుండి తెలియకుండా జరిగే దోపిడీ వల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుంది

ఎంత అధికమైన డబ్బులు వినియోగదారుల వద్ద వసూలు చేస్తున్నారో మనకు తెలియకనే తెలుస్తుంది ఈ విషయాన్ని మనము ఉన్నతాధికారుల వద్ద అడగలేము నాకెందుకులే అని చెప్పి ప్రతి ఒక్కరు బిల్లులు కట్టేస్తున్నారు

అయితే ఇది కిందిస్థాయి ఉద్యోగుల లకు ఏ ఈ డి ఈ ఎస్ సి లెవెల్ లో ఒత్తిడి ఆదేశాల ప్రకారం బిల్లింగ్ ఇలా లేటుగా తీసి వినియోగదారుల జేబులు చిల్లులు పడేలా అదనంగా డబ్బులు కట్టించుకుంటున్నారు

దీనిని పట్టణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ పరిస్థితిని ఉన్నతాధికారులు పరిశీలించి 30 రోజులలోనే విద్యుత్ బిల్లింగ్ చేయాలని కోరుకుంటున్నారు