Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాసర సరస్వతి ఆలయ హుండీలో వింత

– అమ్మవారి ఆలయం లో వింత…
– ఇవాళ జరిగిన హుండీ లెక్కింపులో  బయటపడిన ఓ లెటర్
*త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై గుర్తుతెలియని భక్తుడు ఆలయ హుండీలో లెటర్ వేసిన వైనం

ప్రస్తుతం బాసరలో చర్చనీయాంశంగా మారిన లెటర్ వ్యవహారం

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో జూలై 20
(నిజం న్యూస్)
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈరోజు హుండీ లెక్కింపు జరుగుతుండగా దాంట్లో త్రిబుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు సంబంధించిన డిమాండ్స్ ను వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను లెటర్ గా తయారుచేసి హుండీలో వేసిన గుర్తు తెలియని విద్యార్థుల తల్లిదండ్రులు.
…ఎందరికో మా సమస్యలు చెప్పుకున్న ఎవరు స్పందించడం లేదు… పిల్లల చిన్న ఆశలు అమ్మవైన నీకు తెలియనివి కావు అని రాసిన తల్లిదండ్రులు.

లెటర్లో ఇలా రాశారు….

శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువైన తల్లికి
ప్రణమిల్లి

ఆమ్మా!
మేము ఎందరికో మా బాధలు విన్నవించుకున్నాము కాని మీకు విన్నవించుకోలేదు, మీరు
జ్ఞానం అందించే అమ్మగా మా తప్పుల్ని క్షమించి పిల్లల బాధలు తీర్చే విధంగా పాలకులను,
అధికారులను మేల్కొనాలని మా ప్రార్థణ.
ఆర్.జి.యూ.కె.టి. బాసరలో చదువుతున్న విద్యార్థుల తల్లి దండ్రులం శతకోటి దండాలతో
తమరి పాదాలకు ప్రణమిల్లి వ్రాయునది ఏమనగా గత కొన్ని రెండేళ్లుగా మేము పోరాటాలు
చేస్తున్నాము.
అందులో చదువుతున్న మా పిల్లలు వారం రోజులు ఎండనకా వాననకా శాంతియుతంగా వారి
చదువుల కోసం పోరాడారు. ఆ సంఘటణలను మీరు ప్రత్యక్షంగానే వీక్షించారు.
అంత పోరాటం చేస్తే అధికారులకు గాని ప్రభుత్వానికి కాని ఇంత వరకు కనికరం లేకుండా
పోయింది.

వారి చదువుల కోసం చేసిన పోరాటం ఎలాంటి ఫలితం లేకుండా పోయిందమ్మా.
ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారులు, అధ్యాపకుల ఒత్తిదులకు లోనై కొంత మంది
విద్యార్థులు మరణించారు.
పిల్లలు చిన్న ఆశలు అమ్మవైన మీకు తెలియనివి కావు తల్లి అని ఆ సరస్వతి దేవిని వేడుకున్నారు.