Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సింగరేణి మేము ఎక్స్ ప్రెస్ రైలు రద్దు…ఇబ్బందులు పడుతున్న ప్రజలు

కమలాపూర్ జూలై 20 (నిజం చెబుతాం) కాజీపేట బల్లార్ష రైల్వే సెక్షన్ లో రైల్వే ట్రాక్ మరమ్మత్తుల వలన కాజీపేట నుంచి సింగరేణి గోల్డ్ బెల్ట్ ఏరియాకు వెళ్ళవలసిన మేము రైలు రద్దు తో ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు కాజీపేట నుంచి బల్లర్ష కు వెళ్ళవలసిన రైలు కోల్ బెల్ట్ రెండు ప్రాంతాలకు వారధిగా ఉన్నటువంటి భద్రాచలం రోడ్ నుండి సిర్పూర్ టౌన్ (17034) వెళ్లే సింగరేణి మేము ఎక్స్ ప్రెస్ రైలు రద్దుతో సింగరేణి కార్మికులు కొత్తగూడెం కార్యాలయాలకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతిరోజు కాజీపేట ఉప్పల్, జమ్మికుంట, పోత్కపల్లి, ఓదెల కొలనూర్, పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో నుండి వేలాదిమంది సింగరేణి కాలరీస్ ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు.

అలాగే సింగరేణి లో పనిచేస్తున్న కార్మికులు ఎక్కువ గా ఈ ప్రాంతాలకు చెందినవారు కావడంతో వారు ఎక్కువగా రైలు ప్రయాణంలో వస్తుంటారు.

ట్రాక్ మరమ్మత్తుల కారణంతో రైల్వే శాఖ గూడ్స్ మరియు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రాముఖ్యతను ఇస్తూ  మేము రైళ్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజానీకం ఈ స్టేషన్లో నుండి ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు.

ఈనెల 23వ తేదీ వరకు రద్దు చేసిన రైళ్లను తిరిగి పునః ప్రారంభించాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు