Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆగస్టు 4వ తేదీన హైదరాబాద్ లో కార్మిక గర్జన

ఆగస్టు 4వ తేదీన చలో హైదరాబాద్ కార్మిక గర్జనను జయప్రదం చేయండి
ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి రాజన్న

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో జూలై 20
(నిజం చెప్పుతం)
కార్మిక సమస్యల సాధనకై ఆగస్టు నాలుగవ తేదీన హైదరాబాదులో జరుగు కార్మిక గర్జనను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి .రాజన్న అనారు గురువారం రోజున జిల్లా కేంద్రంలో సోఫినగర్ బీడి ఫ్యాక్టరీ లో కార్మిక గర్జన ధర్నాను జయప్రదం చేయాలని సభ జరిగింది.

ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ బీడి పరిశ్రమలో అన్ని కేటగిరీలకు చెందిన బీడీ కార్మికులకు ఏలాంటి ఆంక్షలు లేకుండా జీవన భృతి అమలు చేయాలని, ఈపీఎఫ్ బీడి కార్మికులందరికి కనీస పెన్షన్ 6000 అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు .

చాలీచాలని జీత బత్యాలతో ఎలాంటి సామాజిక భద్రత లేని స్థితిలో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారని వారికి కనీస వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కనీస వేతనాల మిగతా 68 షెడ్యూల్ జీవోలు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మికుల హక్కులను కాపాడాలని వారు తెలిపారు అసంఘటిత కార్మికులకు బీడీ కార్మికులకు కనీస పెన్షన్ 6000 రూపాయలతో పాటు జీవన భృతి అమలు చేయాలని ఆటో మోటార్ అమాలి కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని వారు తెలిపారు

గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దారుణమైన విషయమని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కానీ దేశంలో ఈ తీర్పులు ఏ ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయలేదు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు,

దశాబ్ద ఉత్సవాలు ఘనంగా జరిపిన తెలంగాణలో కార్మికుల జీవితాలు మాత్రం ఘనంగా ఎందుకు లేవు చెప్పలేదు రాష్ట్రంలో వివిధ కార్మిక రంగాల షెడ్యూల్డ్ జీవోలు 73 ఉన్నాయని వీటిలో ఐదు జీవోలకు తుది నోటిఫికేషన్ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వాటిని రాజపత్రం గెజిట్ ముద్రించలేని దరిద్రమైన పరిస్థితి ఉందని కాంట్రాక్టు కరణను అంతమొందిస్తామని బీరాలు పలికిన కేసీఆర్ మాటలు కోటాలు దాటాయి కానీ కాళ్లు మాత్రం గడప దాటలేదన్న చందంగా ఉన్నదని వారు అన్నారు

తెలంగాణ రాష్ట్రంలోని సంఘటిత అసంఘటిత కార్మికుల హక్కుల వేతనాల ఇతర సమస్యల సాధనకై భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు కార్మిక గర్జనను నిర్వహిస్తున్నది రానున్న ఎన్నికల నేపథ్యంలో కార్మిక సమస్యలు ఎజెండగా పాలకవర్గ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని అందుకనే వేలాదిమంది కార్మికులతో ఆగస్టు నాలుగవ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాదులో జరుగు కార్మిక గర్జన జయప్రదం చేయాలని కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో తెలంగాణా ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు లక్ష్మి . రామ లక్ష్మణ్ కిషన్ పోషెట్టీ రాజేందర్ మల్లేష్ ఎల్లయ్య గంగామణి శోభ కమల సోఫియా తదితరులు పాల్గొన్నారు.