పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టండి, పట్టభద్రుల ఎన్నికల లో తెరాస బలపరిచిన అభ్యర్థిని బారి మెజార్టీతో గెలిపించండి

ములుగు నియోజకవర్గం పట్టభద్రుల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏటూరు నాగారం మరియు మంగపేట మండల కేంద్రాలలో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో అజ్మీరా ప్రహ్లాద్ యువసేన ములుగు జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు కార్యదర్శులు నిమ్మగడ్డ ప్రవీణ్ రాజమల్ల సుకుమార్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక ఓట్లు ములుగు నియోజకవర్గం నుంచి వేసి గెలిపించ వలసినదిగా బాధ్యత ప్రతి ఒక్క పట్టభద్రులకు ఉందని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో భారీ మెజారిటీతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వవలసిందిగా వారు ఈ సందర్భంగా కోరినారు.ఈ కార్యక్రమంలో ఓడ శ్రీనివాస్,రమేష్,నరేష్, వంశీ తరులు పాల్గొన్నారు.