Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతులను అప్రమత్తం చేస్తున్నాం

రైతన్న రాజ్యం బిఆర్ఎస్ లొనే సాధ్యం…మంత్రి జగదీష్ రెడ్డి

హుజూర్ నగర్ జులై 20 (నిజం చెబుతాం న్యూస్)

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ నేడు దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్నం పెట్టే రైతులకు సున్నం పెట్టే ప్రభుత్వాలే నడుస్తున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు రైతులకు కోతలు వాతలు తప్పవు వ్యవసాయానికి 3 గంటల విద్యుత్గ్ చాలు అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విధానాలు బయట పడ్డాయి.
ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను మరియు నేడు తెలంగాణ ఏర్పడ్డాక నెలకొని ఉన్న పరిస్థితులను తప్పకుండా వేరేది వేసుకోవాలి ఆలోచించుకోవాలి చర్చించుకోవాలి అని మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో రకరకాల పార్టీలు ఓట్ల కోసం అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు

కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా బూతులు వాడుతూ అబద్దాలు చెబుతున్నా కానీ ఇన్నాళ్లు భరించాం కానీ నేడు ప్రజలకే ప్రమాదం ఉంచుకొస్తున్న పరిస్థితిలో వారి యొక్క కపట విధానాలు మరియు వారి వ్యాఖ్యలు రానున్న ప్రమాదాన్ని గుర్తు చేస్తున్న సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేసి ఆయా పార్టీల భారీ నుండి ప్రజలను రక్షించేందుకే ఈనాడు రైతు సమావేశాలను నిర్వహిస్తూ ప్రజలను రైతులను అప్రమత్తం చేస్తున్నామని తెలియజేశారు.
మరి ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లో 40000మె వా ఉత్పత్తి అవుతుందని అక్కడ 7 గంటలు ప్రజలు రైతులకు ఇస్తూ మిగతాది పక్కరాష్ట్రాలకు అనుకుంటున్నారని మరి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని మరి అక్కడ ఎందుకు 24 గంటల కరెంటు ఇవ్వడం లేరని…మరి ఈ ప్రశ్నలకు బూతులు వాడకుండా సబ్జెక్టును పక్కదారి పట్టియకుండా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మరి దేశంలోని అన్ని పార్టీలు ఏదో ఒక కారణం చేత పరిపాలన లోకి వచ్చి అబద్దాలు చెబుతూ మోసాలు చేస్తూ ప్రజలను తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తుందని ఆయా ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తుంటా అని ఇటువంటి పార్టీల పట్ల ప్రజలందరూ రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని మరి నేడు ఒక తెలంగాణలో తప్ప దేశం మొత్తం అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే విధంగా ఆయా పార్టీలు పరిపాలన చేస్తున్నాయని తెలియజేశారు.

కేవలం ఒక తెలంగాణలోని కెసిఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 24 గంటల కరెంటు తో పాటు రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెన్షన్లు పరిశుభ్రమైన త్రాగునీరు ఇలా రకరకాల పథకాలు మరియు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం ప్రజల అభివృద్ధికి రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నటువంటి ఏకై రాష్ట్రం

కెసిఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రమేనని ఇలా దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఎన్ని పథకాలను అమలు చేస్తున్న దాఖలాలు లేవు అని తెలియజేస్తూప్రజలు అందరు కాగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలనిమళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటూ వస్తే ప్రజలకు రైతులకు కోతలు వాతలు తప్పవు అని తెలియజేశారు.

కేవలం వారు అధికారం లోకి రవడానికి అబద్దాలు, మొసాలు చేసే ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అవసరమా అని ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. కనుక ప్రజల రైతుల అన్ని వర్గాల ప్రజాల అభివృద్ధికి రాష్ట్ర పురోభివృద్ధికి మళ్ళీ కె సి ఆర్ నాయకత్వ లోని బిఆర్ యస్ పార్టీ ని మాత్రమే గెలిపించుకోవాలని పిలుపును ఇచ్చారు.

ఈ కార్యక్రమములో రైతులు ,ప్రజలు ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,తదితరులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు