Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గోదావరి ఎగువ – దిగువ బేసిన్లలో వరద ప్రవాహా సమాచారం

గోదావరి వరద ప్రవాహం శ్రీ రామ్ సాగర్, కడ్డాం డ్యాం, శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం, కంతనపల్లి, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం, పొలవరం, ధవళేశ్వరం వద్ద పెరుగుతూ, లక్ష్మి బ్యారేజ్, పేరూరు, ఎటూరునాగారం వద్ద నెమ్మదిగా తగ్గుతుంది.

పౌని వద్ద వెంగంగా తగ్గుతుంది

వార్ధ వరద ప్రవాహం బామిని, సిర్పూర్ వద్ద తగ్గుతుంది

పాతగూడెం వద్ద ఇంద్రావతి వరద ప్రవాహం తగ్గుతుంది

శబరి సుక్మా వద్ద తగ్గుతూ, చింతూరు వద్ద పెరుగుతుంది.

తెలంగాణలో రానున్న 5 రోజుల్లో మోస్తరు వర్షాలు విసృతంగా, అక్కడక్కడ భారీ వర్షాలు & కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 22, 23 తేదీల్లో మోస్తరు వర్షాలు విసృతంగా, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ సూచన

23వ తేదీ వరకు గోదావరి – శబరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.