Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గోదావరి నీటిమట్టం పెరగడంతో పాఠశాలలకు సెలవులు

పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్.. డాక్టర్ ప్రియాంక అలా

చర్ల జులై 20 (నిజం చెపుతాం) మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు గురువారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సెలవు ప్రకటించారు

మండలంలోని గొంపల్లి శివారు ఈత వాగు వద్ద వరద ఉద్రిత గా ప్రవహించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా కొత్తపల్లి దండుపేట గ్రామాలకు తాసిల్దార్ భరణి బాబు. సిఐ.బి అశోక్ లురాకపోకలను నిలిపివేశారు

ఈ సందర్భంగా రైతులకు జాలర్లకు పశువుల కాపరులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సతీష్ గడ్ నుండి వస్తున్న వరదలకు మధ్యతరహా ప్రాజెక్టుకు భారీ నీరు చేరుకుంది

దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 24 గేట్లను ఎత్తివేసి 91. 991 క్యూ చెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు డి ఈ తిరుపతి.జెఇ ఉపేందర్ వెల్లడించారు

దీంతో భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 40అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక 48 అడుగులు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక 53 అడుగులు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు